పశ్చిమగోదావరి

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, జూన్ 21: రోజురోజుకూ పెరుగుతున్న జన సామర్థ్యం, ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, తద్వారా ప్రమాదాలు జరగకుండా రక్షణ పొందాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. గురువారం ప్రజల ముందుకు రవాణా శాఖ కార్యక్రమంలో భాగంగా ఎల్‌ఎల్‌ఆర్ మేళాను మంత్రి పితాని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ లైసెన్సు కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రవాణాశాఖ ప్రజల ముందుకు వచ్చి అర్హులైన వారికి లైసెన్సులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుకున్న దానికన్నా అధిక సంఖ్యలో లైసెన్సులు కోసం పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్రాంగణమంతా రద్దీగా, గందరగోళంగా మారింది. దీంతో ఒకదశలో పోలీసులు జనాన్ని పూర్తిస్థాయిలో అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యక్రమంలో విజయవాడ, ఏలూరు డీటీసీలు ఎస్‌ఎస్ మూర్తి, వీరా ప్రసాద్, తణుకు ఇన్‌స్పెక్టర్ ఎంయు శ్రీనివాస్, జడ్పీటీసీ రొంగల రవికుమార్, ఆదిరెడ్డి, గంధం వెంకట్రాజు, రామిరెడ్డి, వెలిచేటి బాబూరాజేంద్రప్రసాద్, బడేటి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

యోగాతోనే ఆరోగ్యం
* భీమవరంలో కళాశాలల సౌజన్యంతో యోగా దినోత్సవం
భీమవరం, జూన్ 21: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు భీమవరంలోని దంతులూరి నారాయణరాజు క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా యోగా అసోసియేషన్, డిఎన్నార్ కళాశాల పాలకవర్గం, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సంయుక్తంగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చేపట్టారు. అంతర్వేది వశిష్ఠ ఆశ్రమం, భీమవరం శంకర పీఠం పీఠాధిపతి ప్రసాద్ గురూజీ, నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు, డిఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఛైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు యోగాసనాలు ప్రదర్శించారు. తాడాసన్, పాదహస్తాసన్, అర్ధచక్రాసన్, త్రికోణాసన్, భద్రాసన్, వజ్రాసన్, అర్ధవృష్ఠాసన్, శవాంకాసన్, ఉత్థానమండూకాసన్, మకాసన్, భుజంగాసన్, సేతుబంధాసన్, ఉత్థానపాదాసన్..ఇలా అనేక ఆసనాలను వేశారు. ప్రాణాయామం, ధ్యానం, సంకల్పం, శాంతిమంత్రం, గీత్, ప్రవచనం, యోగా నిర్వాహకులను సత్కరించి, వందన సమర్పణ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు 2018కి ఆహ్వానం అందించారు. వారందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ గోకరాజు గంగరాజు చిత్రాలతో ముద్రించి ఉన్న టీషర్ట్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీ గోకరాజు గంగరాజును గజమాలతో సత్కరించారు. యోగా పుస్కకాన్ని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఛైర్మన్ కెవి విశ్వనాధరాజు బహుమతిగా అందించారు.