పశ్చిమగోదావరి

దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, జూన్ 21: దొంగరావిపాలెం వద్ద గోదావరి నుండి బ్యాంకు కెనాల్‌కు నీరందించేందుకుగాను శాశ్వత ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలైనట్టు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. గురువారం ఆచంట ఏఎంసీలో ఆచంట నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పితాని మాట్లాడుతూ ఇసుక ర్యాంపులు వద్ద అధికారుల పర్యవేక్షణలో నామ మాత్రపు రుసుముతో ఇసుకను పొందేందుకు ఏర్పాట్లుచేసినట్టు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ మేకా పద్మకుమారి, జడ్పీటీసీ సభ్యులు బండి రామారావు, రొంగల రవికుమార్, ఆదినారాయణరెడ్డి, టీడీపీ మండల నాయకులు కేతా మీరయ్య, తమనంపూడి శ్రీనివాసరావు, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, డీసీ ఛైర్మన్ తమ్మినీడి ప్రసాద్, బీరా నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నవంబర్‌లో ఎడ్లపందాలు
ఏలూరు, జూన్ 21: జిల్లాలో నవంబర్‌లో ఎడ్లపందాలు నిర్వహిస్తున్నామని, అందాల ఆవులు, గిత్తల పోటీలతోపాటు పాల పోటీలను కూడా భారీఎత్తున్న నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుగణాభివృద్ధి సంస్ధ ఛైర్మన్ పాలకపాటి గాంధీ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం కలెక్టరు భాస్కర్‌ను గాంధీ ఘనంగా సత్కరించి మెమొంటో అందజేశారు. జిల్లాలో పాడిపశువుల అభివృద్ధికి, పశుగ్రాస ఉత్పత్తులకు ఎన్నో సేవలు అందిస్తూ పశువుల ఆసుపత్రులకు భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ పాడిపరిశ్రమాభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టరు సేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో రైతుల్లో చైతన్యం కలిగించడానికి అధిక దిగుబడి సాధించే పాలపోటీలను నిర్వహిస్తామని, ఆవులు, గిత్తల అందాల పోటీ కూడా నిర్వహించి ఎడ్లతో బండలాగుడు పోటీలను వచ్చే నవంబర్‌లో పెద్దఎత్తున నిర్వహిస్తామని గాంధీ చెప్పారు. జిల్లాలో 38 పశువుల ఆసుపత్రుల భవనాల నిర్మాణాలు చేపట్టామని, వాటిలో 10 పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిలో 18 వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో అధిక పాలదిగుబడి సాధించడానికి 2లక్షల 50వేల డోసులను పశువులకు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామని, అంతేకాకుండా సెక్సర్ సెమెన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలో ప్రతి పశువుకు బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోందన్నారు. కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమ అభివృద్ధి సాధించినప్పుడే రైతాంగం ఆర్దికంగా అభివృద్ధి సాధించగలదన్న ఉద్దేశ్యంతో జిల్లాలో పాడిపరిశ్రమాభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.