పశ్చిమగోదావరి

సెల్ టవర్ ఎక్కిన ఆందోళనకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం/వీరావసరం, జూన్ 21: భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మించిన మెగా ఆక్వా ఫుడ్‌పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ గరువారం నరసాపురంమండలం కొప్పర్రులో ఇరువురు, వీరవాసరం మండలం మత్స్యపురిలో ఒకరు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసారు. నరసాపురం మండలంలోని కొప్పర్రు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పచ్చని పొలాలు, జనావాసాల మద్య నుండి తుందుర్రు ఆక్వాపార్కును తరలించాలని గత మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. గాక ఇటీవల ఫుడ్ పార్కు పరిశ్రమ పైప్‌లైన్ పనులు చేపట్టారు. దీంతో నిరసనకారులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. దీనిలో భాగంగా జొన్నలగరువు గ్రామానికి చెందిన కొయ్యే సంపదరావు, కొయ్యే పెదపౌలు గురువారం ఉదయం కొప్పర్రు గ్రామంలోని సెల్ టవర్ ఎక్కారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇరువురు టవర్‌పైనే ఉండిపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తిత పరిస్థితి నెలకొంది. ఆందోళనకారుల నిరనలతో ఫుడ్ పార్కు పరిసర గ్రామాల్లో సెల్ టవర్లు, మంచినీటి ట్యాంకులకు పోలీసులు గట్టి భద్రత కల్పించారు. అలాగే వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో సెల్ టవరెక్కి ఆరేటి సత్యవతి ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సెల్ టవర్‌పైనే ఉండటంతో మత్స్యపురి గ్రామంలో ప్రజలు రాస్తారోకో చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. భీమవరం రూరల్ మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్ పార్కు కోసం ఏర్పాటుచేస్తున్న పైప్‌లైన్ నిర్మాణం ఆపాలంటూ గ్రామానికి చెందిన ఆరేటి సత్యవతి గురువారం ఉదయం 8గంటలకు వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలోగల సెల్‌టవర్ ఎక్కి నిరసన కార్యక్రమం మొదలుపెట్టారు. దీనితో ఆమెకు మద్దతుగా తుందుర్రు, మత్స్యపురి గ్రామానికి చెందిన ప్రజలు సెల్‌టవర్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు వీరవాసరం తహసీల్దార్ ఎం ముక్కంటి, సిబ్బందితో మత్స్యపురి గ్రామానికి చేరుకున్నారు. సెల్‌ఫోన్ ద్వారా టవర్‌పై ఉన్న ఆరేటి సత్యవతితో సంప్రదించారు. తుందుర్రు గ్రామం గుండా పైప్‌లైన్ నిర్మాణ పనులు ఆపాలని, అలాగైతేనే తాను టవర్ దిగుతానని సత్యవతి తహసీల్దార్ ముక్కంటికి తెలిపారు. అలాగే తమ గ్రామం గుండా వెళుతున్న ఆక్వా పైపులైన్ వల్ల తాగునీటి పైపులైన్ పాడవుతుందని ఆమె వివరించారు. దీనితో తహసీల్దార్ ముక్కంటి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఫోన్‌లో సంప్రదించి నూతన పైపులైన్ ఏర్పాటుచేయిస్తామని హామీ ఇచ్చారు. అయినా సత్యవతి టవర్ దిగి రాకపోవడంతో ఆమె కుమారుడు మత్స్యపురి చేరుకున్నారు. ఉదయం నుంచి ఒక మహిళ ప్రజాసంక్షేమం కోరి ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం పట్ల మత్స్యపురి గ్రామంలో రాత్రి 9గంటలకు ప్రజలు రాస్తారోకోకు దిగారు. దీనితో భీమవరం నుంచి నరసాపురం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం నుంచి సత్యవతి సెల్ టవర్‌పైనే ఉండటంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.