పశ్చిమగోదావరి

వ్యవసాయ శాఖ ప్రకటనలో ఆంతర్యమేమిటో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమడోలు, జూన్ 24 : ముందస్తు సార్వా చేపట్టాలని ప్రకటించి ఆ మేరకు రైతులను చైతన్య పరచిన వ్యవసాయ శాఖ తాజాగా రైతులు సాగుకు ఆసక్తి కనపరిచే విజేత (ఎంటియు 1001), కాటన్ దొర సన్నాలు (ఎంటియు 1010) రకాల వరి సాగుచేయవద్దంటూ ప్రకటించడం వెనుక గల ఆంతర్యం తెలియక రైతులు ఆయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ భీమడోలు సహాయ సంచాలకులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆయన కార్యాలయ ఆధ్వర్యంలోని పనిచేసే మండల వ్యవసాయ అధికారులు ఆ రకాలను రాయితీ ధరపై రైతులకు అందజేసేందుకు విత్తనాలను సిద్ధం చేయడం వెనుక గల మర్మం రైతులకు అర్ధం కావడం లేదు. ఆ రకాలను సాగు చేయాలా, వద్దా అనే మీమాంసను రైతులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ భీమడోలు సహాయ సంచాలకులు కె జయదేవ్ రాజన్ తన ప్రకటనలో విజేత, కాటన్ దొర సన్నాలు రకాలకు మార్కెట్ లేదని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రకాలు సాగువద్దని అంటున్నారు. వాస్తవానికి ఈ తరహా ప్రకటన ప్రభుత్వపరంగా గానీ, మార్కెటింగ్ శాఖ పరంగా గాని చేయవలసి వుంది. ఇక వ్యవసాయ శాఖ ఆ రకం విత్తనాలు అమ్మకాలను నిలిపి వేయవలసి వుంది. కానీ ఆ శాఖ ద్వారా రాయితీపై సదరరు విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయి. అనేక సీజన్లలో రైతులు స్థానికంగా ఖరీఫ్, రబీలలో 120 రోజుల పంట కాలం, ఎకరాకు సరాసరిన 3.50 టన్నుల ధాన్యం దిగుబడి ఇచ్చే ఆ రకాలను సాగు చేస్తున్నారు. కోస్తా జిల్లాల్లో ఆ రకాల సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. స్థానికంగా గల పొలాలలో జింకు ధాతులోపం ఎక్కువగా వుంది. భూసార పరీక్షల్లో ఈ విషయం తేలింది. దీని నివారణకు వ్యవసాయ శాఖ పూర్తి రాయితీపై ముడి జింక్‌ను రైతులకు అందజేస్తుంది. కానీ ఆ రెండు వరి రకాలు జింక్ లోపాన్ని అధికమించి అధిక దిగుబడి ఇస్తాయన్నది అందరికీ తెలిసిందే. స్థానికపరిస్థితులకు అనుగుణంగా 80 శాతం పైగా రైతులు ఆ రకాలనే సాగు చేస్తుంటారు. వీటి స్థానంలో 150 రోజులుపంటకాలం, ఎకరాకు 2.50 టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఉత్పత్తి చేసే ఇతర రకాలు సాగు చేయాలని ఉన్నత స్థాయి వ్యవసాయ అధికారి అంటున్నారు. దీని వల్ల ముందస్తు సాగుకు అర్ధం లేక పోతుందని రైతులు అంటున్నారు. ఈ రకాలలో గింజ సులువుగా రాలే స్వభావంతోపాటు కోత సమయంలో వర్షం వస్తే గింజకు మొలకెత్తే లక్షణాలున్నాయి. రైతులు ముందస్తు సాగు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన కు ఇది కూడా ఒక కారణంగా రైతులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ నెల 28వ తేదీన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించి నాట్లకు శ్రీకారం చుట్టే క్రమంలో ఈ తరహా ప్రచారం చేయడం రైతులను ఆయోమయానికి గురి చేస్తుందని కొందరు రైతులు అంటున్నారు. ఈ విషయాలపై కొందరు వ్యవసాయ అధికారులు అనధికారికంగా మాట్లాడుతూ విజేత, కాటన్ దొర సన్నాలు రేషన్ బియ్యంగా పంపిణీ జరుగుతున్నాయన్నారు. ఇటీవల కాలంలో సదరు బియ్యం నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లి రీసైక్లింగ్ జరిగి వివిధ బ్రాండ్ల రూపంలో, రకరకాల పేర్లతో మార్కెట్‌లోనికి వస్తున్నాయన్నారు. అధిక ధరకు అమ్ముతున్నారన్నారు. దీన్ని అరికట్టేందుకు విజేత, కాటన్ దొర సన్నాలు వరి రకాలను సాగు చేయొద్దంటూ తమ శాఖ ఫ్రచారం చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయాలపై ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం వెలువడాల్సిన పరిస్థితి ఉంది.