పశ్చిమగోదావరి

మత్స్యకారులు ఐక్యంగా పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, జూన్ 24: రాష్ట్ర జనాభలో అధిక శాతం ఉన్న మత్స్యకారులు రాజకీయ, ఆర్థిక, విద్యారంగాల్లో తమ వాటా సాధించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం స్ధానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన అగ్నికుల క్షత్రీయుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బర్రి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ జనాభాలో అగ్నికుల క్షత్రీయుల శాతం పెరిగిందన్నారు. అంతేకాక రాష్ట్ర ఆదాయంలో రూ.16,500 కోట్లు మత్స్య సంపద నుంచే లభిస్తోందన్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారులకు తగిన ప్రాధాన్యతనివ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. జనాభా ప్రతిపాదికన తమకు రాజకీయంగా చెందాల్సిన వాటా రావడంలేదన్నారు. తమకు జరిగిన అన్యాయంపై అంతా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైతే చైతన్యంగా ఉంటారో వారికే రాజకీయ ఫలాలు అందుతాయనే వాస్తవాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో అగ్నికుల క్షత్రీయులంతా ఐక్యంగా ఉంటూ తమ సత్తా చాటాలన్నారు. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీటు సాధించి ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు అంతా కృషి చేయాలని బర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. బొమ్మిడి ఛారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అవకాశమిచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. గాడి నెహౄ అధ్యక్షత వహించిన ఈ సభలో ఎంపిపి వాతాడి కనకరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు, కౌన్సిలర్ తిరుమాని శశిదేవి, ఏఎంసీ ఛైర్మన్ కొప్పాడ రవి, మత్స్యకార సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అండ్రాజు చల్లారావు, వైస్ ఎంపీపీ అండ్రాజు రామన్న, పల్లవ సేన రాష్ట్ర అధ్యక్షులు కొల్లాటి బాబూరావు, వైధాని నాగేశ్వరరావు, కొల్లు పెద్దిరాజు, బొమ్మిడి రవి శ్రీనివాసు, పెమ్మాడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.