పశ్చిమగోదావరి

పోలవరంపై సమగ్ర నివేదిక అందజేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, జూన్ 24: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలనే ఆశయంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర తూర్పు గోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి ఆదివారం ఉదయం చేరుకుంది. ఈ సందర్భంగా గోష్పాద క్షేత్రంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించి ప్రాజెక్టు ప్రగతిపై వివరాలు తెలుసుకుంటామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలనే ధ్యేయంతో ఉన్నారన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 13 జిల్లాలకు వరమని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీపై దుప్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తామే చేపడతామని సీఎం చంద్రబాబునాయుడు కోరికపై కేంద్రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. అనంతరం పోలవరం సందర్శన యాత్ర కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి గోదావరి గట్టు మీదుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి బయల్దేరి వెళ్లింది. ఈ యాత్రలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జిఎల్ నర్సింహారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు రంగరాజు, కేంద్ర రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు పి రఘురామ్‌తోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి విశేష సంఖ్యలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ యాత్ర బస్సు వెనుక సుమారు 150 కార్లతో బీజేపీ శ్రేణులు ర్యాలీగా పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు తరలివెళ్లారు.
సందర్శన యాత్రకు ఘన స్వాగతం
పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి ఆదివారం చేరిన సందర్భంగా జిల్లా, పట్టణ నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణ బీజేపీ నాయకులు పరిమి రాధ, పిల్లలమర్రి మురళీకృష్ణ, కోడూరి లక్ష్మీనారాయణ, బివి ముత్యాలరావుతోపాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసశర్మ తదితరులు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.