పశ్చిమగోదావరి

పోలవరం పూర్తిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నూరు శాతం నిధులిచ్చి పూర్తిచేస్తుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నేతలతో వచ్చి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించకున్నా కేంద్ర ప్రభుత్వం పూర్తిచేస్తుందని..ఈ విషయాన్ని ప్రజలకు ప్రధాని మోదీ చెప్పమన్నారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కల అని సీఎం చంద్రబాబునాయుడు అంటున్నారని, గతంలో తొమ్మిది సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడు పోలవరం ఆయనకు గుర్తురాలేదని ఎద్దేవా చేశారు. మోదీకి ప్రాజెక్టు నిర్మించాలన్న ఆసక్తి ఉంది కాబట్టే తెలంగాణాలో ఉన్న ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలపటం దేశ చరిత్రలో మొదటిసారన్నారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతి పైసా చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్‌టిఐ చట్టం ద్వారా సేకరించామన్నారు. సీఎం మాత్రం రూ.18వేల కోట్లు కేంద్రం బకాయి ఉందంటున్నారని, అయితే ఒక్క పైసా కూడా బకాయి లేదని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఆమోదం పొందినా నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కేంద్రం అడ్డుపడుతోందని ఆరోపించటం తగదన్నారు. భూసేకరణ విషయంలో అవకతవకలు జరిగినట్టు తమకు ఫిర్యాదులు అందాయని, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన నిర్వాసితులకు అన్యాయం వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి రహితంగా ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూరు శాతం నిధులు అందజేస్తోందని, కావున కాలయాపన చేయకుండా అనుకున్న సమయానికి పూర్తిచేయాలన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన సమయంలో కాటన్ దొర పోలవరం నిర్మించాలనే ఆలోచన చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించలేదన్నారు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదని, దేవగౌఢ ప్రధాని కావటానికి తానే కారణమని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ సమయంలో ఎందుకు పోలవరాన్ని నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు వైఎస్సార్ శంకుస్థాపన చేసి, కాలువలు తవ్వించారే తప్ప ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అబద్ధాలు ఆడటంలో సమర్థుడని, అబద్ధాలతోనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు అధార్టీ ఆధ్వర్యంలో ప్రాజెక్టును నిర్మించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారన్నారు. గతంలో పోలవరం గూర్చి ఎప్పుడూ మాట్లడని చంద్రబాబు ప్రాజెక్టు నిర్మించలేనని ఉద్దేశ్యంతో తాడిపూడి, పుష్కరం ఎత్తిపోతల పథకాలు నిర్మించారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్రాలో ఉన్న సుజల స్రవంతి, తెలుగు గంగ ప్రాజెక్టులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ ఆయనే ఇస్తున్న చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రేశ్వరి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించటం లేదని రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఆంధ్రాకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తుది నుంచీ అంకితభావంతో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ప్రధాని మోదీ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నా డీపీఆర్‌లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటంలో ఆలస్యం చేస్తోందన్నారు. సోమవారం పోలవరం అంటూ సీఎం నాటకాలాడుతున్నారని, బీజేపీ నాయకులు ప్రతి రోజు పోలవరం అంటూ అంకితభావంతో నిర్మాణానికి కృషి చేస్తున్నామని పురంధ్రేశ్వరి అన్నారు. ఏమైనా అడ్డంకులు ఉంటే పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. పూర్తయిన ప్రతి పనికి పైలాన్ వేస్తున్నారని, ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి కూడా ఒక పైలాన్ వేస్తే బాగుంటుందని వ్యంగ్యంగా పురంధ్రేశ్వరి అన్నారు. మధ్యాహ్నం 1గంటకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న బీజేపీ నాయకులు స్పిల్‌వేను పరిశీలించారు. వారికి ఇఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావు, సీఈ శ్రీ్ధర్, ఎస్‌ఈ రమేష్‌బాబులు ప్రాజెక్టు గూర్చి వివరించారు. భూ సేకరణ గూర్చి ఐటీడీఏ పీవో హరేంద్రియ ప్రసాద్ వారికి వివరించారు. ఎంపి కంభంపాటి హరిబాబు, రాజ్యసభ సభ్యుడు జిఎల్‌వి నర్సింహరావు, ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసవర్మ, పోలవరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మొడియం శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా
మేలుచేసేందుకు చర్యలు
*రైతులకు మంత్రి జవహర్ భరోసా
కొవ్వూరు, జూన్ 24: వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతాంగానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. కొవ్వూరు మెరక వీధి సెంటర్లో రూ.10లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన రైతు బజార్‌ను మంత్రి జవహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళారీ వ్యవస్థను అరికట్టాలనే ఉద్దేశ్యంతో రైతులే నేరుగా వచ్చి రైతు బజార్లో కూరగాయలు అమ్ముకుని ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటుచేసుకుని ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 85.6 శాతం వృద్ధిరేటు సాధించినట్టు చెప్పారు. ఈ వృద్ధిరేటు సాధించటానికి సీఎం చంద్రబాబునాయుడు తీసుకున్న ముందస్తు చర్యలే కారణమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కె రాధారాణి, ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, టీడీపీ నాయకులు జెవిఎస్ చౌదరి, బివి రాఘవులు, కొట్రు శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎస్ శ్రీనివాసు, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ జి నందినీదేవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు చేరువలో రవాణా శాఖ
*మంత్రి పితాని* డ్రైవింగ్ లైసెన్సుల కోసం వేలల్లో జనం
ఆచంట, జూన్ 24: డ్రైవింగ్ లైసెన్సుల కోసం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్‌ఎల్‌ఆర్ మేళాను ప్రజలంతా వినియోగించుకోవాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖా మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆచంటలోని ఏఎంసీలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎల్‌ఎల్‌ఆర్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లకుండా నేరుగా మన ముంగిట నిర్వహిస్తున్న శిబిరాల్లోనే పొందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి అవకాశం కల్పించారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం నేరమని, దీనివల్ల వాహన ప్రమాదాలు జరగడంతోపాటు ప్రాణనష్టం జరగడం పరిపాటిగా మారిందన్నారు. ప్రమాదాలు నివారించడానికి, నియమ నిబంధనలు తెలుసుకోవడానికి అర్హత కలిగిన ప్రతిఒక్కరూ లైసెన్సు కలిగి ఉండాలన్నారు. అయితే 18 ఏళ్ల వయస్సు నిండకుండానే తల్లిదండ్రులు పిల్లలకు బైకులు, నాలుగు చక్రాల వాహనాలు ఇస్తున్నారని, ఇది ప్రమాదాలకు దారితీసి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నడిపేవారు విధిగా ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని బాధ్యతగా ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా ఇంటికి తిరిగిరావాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌కు ఎల్‌ఎల్‌ఆర్ ప్రథమ గుర్తింపు ధ్రువపత్రమన్నారు. డ్రైవింగ్‌లో మంచి శిక్షణ పొందితే హెవీ లైసెన్సులు కూడా పొందవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు కావాల్సిన వారు సంబంధిత ధృవపత్రాలతో ముందుగా ఎల్‌ఎల్‌ఆర్ పొందాలని కోరారు. ఎంత సమయమైనప్పటికీ వచ్చిన వారందరికీ ధృవపత్రాలు అందించి వెళ్ళాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పాలకొల్లు మోటార్‌వెహికల్ ఇన్‌స్పెక్టర్ బి స్వర్ణశ్రీనివాస్ నాయక్, ఆనందరావు, ఆచంట, పెనుగొండ ఏఎంసీ ఛైర్మన్లు ఉప్పలపాటి సురేష్‌బాబు, సానబోయిన గోపాలకృష్ణ, ఎంపీపీ మేకా పద్మకుమారి, జడ్పీటీసీ బండి రామారావు, బొక్కా నాగేశ్వరరావు, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ కండిబోయిన సత్యనారాయణ, ఏఎంసీ ఉపాధ్యక్షుడు రుద్రరాజు రవివర్మ, డీసీ ఛైర్మన్ తమ్మినీడి ప్రసాద్, సర్పంచ్ బీర తిరుపతమ్మ, టీడీపీ నాయకులు కేతా మీరయ్య, దొంగ నాగార్జున, బీర నరసింహమూర్తి, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
‘నామినేషన్’ పద్ధతిలోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకం
* కీలకంగా మారిన ఎంపీ గంగరాజు నిర్ణయం* నేడో, రేపో ప్రకటించనున్న రాష్ట్ర అధ్యక్షుడు కన్నా

భీమవరం, జూన్ 24: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకాన్ని ఆ పార్టీ నామినేషన్ పద్ధతిలో చేయనుంది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు జిల్లా నుంచి ప్రతిపాదించిన పేర్లను ఆయన పరిశీలించి ఒకరి పేరును జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం జరుగుతోంది. నిన్నటి వరకు ఎన్నిక నిర్వహించాలని భావించారు. అయితే అనివార్య కారణాల రిత్యా ఎన్నిక జరగలేదు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో గ్రామ, మండల, వార్డు, పట్టణ స్థాయిలో కమిటీలను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పాటుచేసుకోవడం జరిగింది. ఆ సమయంలోనే జిల్లా అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే జిల్లా అధ్యక్షుడి నియామకం ఏకగ్రీవం చేయాల్సిన అవసరముందని రాష్ట్ర పార్టీ సూచించింది. అయితే అప్పటి వరకు జిల్లా అధ్యక్షునిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాసవర్మ ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలని అభిప్రాయ పడినట్లు తెలిసింది. కానీ జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, మాజీ మంత్రి ఉప్పలపాటి కృష్ణంరాజు, అప్పటి మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు వంటి పెద్దలు కోర్ కమిటీలో కూర్చోలేదు. దీంతో భూపతిరాజు శ్రీనివాసవర్మ వరకు మరి కొంత కాలం పాటు కొనసాగే అవకాశం కలిసివచ్చింది. ఈ నేపధ్యంలోనే అమిత్ షా రాజమహేంద్రవరం వచ్చిన సమయంలో కోర్ కమిటీ భేటీ జరిగింది. కాని సమర్ధవంతంగా జిల్లా నూతన అధ్యక్షుడి గురించి పూర్తిస్థాయిలో చర్చించలేదు. దీంతో ఈనాటి వరకు కూడా భూపతిరాజు శ్రీనివాసవర్మ కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్సీ సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షునిగా ఆలిండియా పార్టీ ప్రకటిస్తోంది. ఆయన సారధ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెళ్లేందుకు వర్మ వ్యూహరచన చేసుకున్నట్లు తెలిసింది. కాని ఇంతలో ఆలిండియా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించింది. దీంతో జిల్లాల పర్యటనలకు ముందు కన్నా లక్ష్మీనారాయణ జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ జిల్లా అధ్యక్షుడిని వెంటనే నియమించాలని జిల్లా నేతలకు హుకుం జారీ చేశారు. దీంతో కొద్దిరోజులుగా జిల్లా భారతీయ జనతా పార్టీలో సందడి ప్రారంభమైంది. అయితే జిల్లా అధ్యక్షుడిని నియమించే విషయంలో ఎంపీ గోకరాజు గంగరాజు నిర్ణయం చాలా కీలకమైంది. ఇప్పుడు ఆయన ఎవరి పేరును సూచిస్తారో వారినే జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారని తెలిసింది. దీంతో జిల్లాలోని ఆశావహులు భీమవరంలోని ఎంపీ గోకరాజు గంగరాజు కార్యాలయం చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు. బీజేపీ పెద్దలను కలుసుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లోని కీలకమైన వారిని కలుసుకుని ఆశిస్సులు కావాలని కోరుతున్నట్లు తెలిసింది.
ఇక ఆశావహుల విషయానికి వస్తే క్షత్రియ సామాజిక వర్గం నుంచి గణపతిరాజు, కాపు సామాజిక వర్గం నుంచి రావూరి సుధ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు పార్టీలో సీనియర్‌గా ఉన్న దేవరపల్లికి చెందిన కైరం అప్పారావులు పోటీ పడుతున్నట్లుగా తెలిసింది. ఇక నిన్నటి వరకు పీవీఎస్ వర్మ, అంతకు ముందు బుంగా సారధి , అర్జుల మురళీ పేర్లు వినిపించాయి. వీరిలో మురళీని బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు బలపరుస్తున్నట్లు సమాచారం. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న అల్లూరి సాయిదుర్గరాజుతో పాటు కొవ్వూరు నుంచి మరో ఇద్దరు జిల్లా అధ్యక్ష పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా అధ్యక్షుడిని నామినేషన్ పద్ధతిలోనే నియమించడం జరుగుతోన్న నేపధ్యంలో నేడో, రేపో ఆ పేరును రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించనున్నట్టు తెలిసింది.