పశ్చిమగోదావరి

పామాయిల్ రైతులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 16: రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా పామాయిల్ రైతులను ఫ్యాక్టరీ యాజమాన్యాలు మోసం చేస్తూ టన్నుకు 500 నుంచి 1200 రూపాయల వరకు ధర తగ్గించి ఇస్తూ కోట్లాది రూపాయల మేరకు రైతుల సొమ్మును కాజేస్తున్నాయని, ఈదోపిడిని ఆరికట్టి వారినుంచి సొమ్మును రికవరీ చేయాలని పామాయిల్ రైతులు కలెక్టరుకు మొరపెట్టుకున్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్‌లో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ ఆధ్వర్యంలో రైతులు కలెక్టరు డాక్టరు భాస్కర్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పామాయిల్ గెలలను రైతుల నుంచి ఫ్యాక్టరీ యాజమానులు ఒకేధరకు కొనుగోలు చేసేవారని, అయితే రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇంతవరకు తెలంగాణా ప్రాంతంలోని పామాయిల్ గెలల ధరలు మన రాష్ట్ర పామాయిల్ గెలల ధరల కంటే అదనంగా 500 నుంచి 1200 రూపాయల వరకు అధికంగా చెల్లించి అక్కడి ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. దీనికి కారణంగా ఆయిల్‌ఫెడ్ నివేదక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గెలల నుంచి ఆయిల్ రికవరీ శాతం తక్కువుగా వస్తోందని, ఈకారణంగానే రేటు తక్కువుగా నిర్ణయించామని ఫ్యాక్టరీ యాజమాన్యాలు చెపుతూ వచ్చాయన్నారు. గోద్రెజ్ కంపెనీవారికి తెలంగాణాకు చెందిన మూడు మండలాల నుంచి వస్తున్న పామాయిల్ గెలలకు అక్కడి ధరను ఇస్తూ పక్కనే చేర్చి ఉన్న ఆంధ్ర రాష్ట్ర గెలలకు మన రాష్ట్ర ధరల ప్రకారం తగ్గించి ఇస్తున్నారన్నారు. ఈవిషయమై అనుమానించిన రైతుల ఆందోళనల కారణంగా రైతు సమాఖ్య నాయకులు సంబంధిత అధికారుల సమక్షంలో ఇటీవల ఆంధ్ర ప్రాంతం నుంచి వెయ్యి టన్నుల గెలలను తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయించగా రెండుచోట్ల ఒకేవిధంగా రికవరీ శాతం వచ్చిందని తెలిపారు. దీనిపై గతంలో కలెక్టరుకు పూర్తి నివేదికలతో నివేదిక అందజేయగా ఫ్యాక్టరీల యాజమాన్యాలు రైతులను మోసం చేస్తున్న వైనం గుర్తించి వెంటనే రైతులకు సక్రమంగా రేట్లు పెంచి ఇవ్వాలని ఆదేశించారని, ఇది జరిగి రెండునెలలు గడుస్తున్నా ఈ ఆదేశాలు అమలుకావటం లేదన్నారు. రికవరీ శాతం ఒకేవిధంగా ఉన్నందున ధరల్లో వ్యత్యాసం లేకుండా ఆంధ్రప్రాంత పామాయిల్ రైతులకు కూడా తెలంగాణా రైతులకు ఇస్తున్న విధంగా ధర చెల్లించేలా వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యాలను ఆదేశించాలని కోరారు. అలాగే రెండు రాష్ట్రాల్లో రికవరీ శాతం ఒకేవిధంగా ఉన్నందున ఒకే రేటు నిర్ణయిస్తూ గత నాలుగేళ్ల వ్యత్యాస ధరలను రైతులకు చెల్లించాలని లేనిపక్షంలో పామాయిల్ రైతులు రాష్టవ్య్రాప్తంగా ఉద్యమిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన పామాయిల్ రైతులు పాల్గొన్నారు.