పశ్చిమగోదావరి

సమన్వయంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 16 : గ్రామాలలో పంచాయితీ అధికారులు, పోలీసులు సక్రమంగా సమన్వయంతో పనిచేస్తే 90 శాతం ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రక్కింటి కొబ్బరిచెట్టు ఆకులు తమ ఇంటిపై పడుతున్నాయని, డ్రైన్లలో మురుగునీరు వెళ్లడం లేదని, ఒక ఆసామి రోడ్డు ఆక్రమించి తమ ఇంటికి దారి మార్గం లేకుండా చేస్తున్నారని తదితర చిన్న చిన్న సమస్యలు కలెక్టర్ వరకు వస్తున్నాయంటే పంచాయితీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోందో అర్ధం అవుతోందన్నారు. పంచాయితీ సెక్రటరీ, ఇవో పి ఆర్‌డి, డివిజనల్ పంచాయితీ అధికారి ఇలా ఆరు స్టేజీలు దాటి చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి తన వద్దకు వస్తున్నారంటే అధికారులు ఏ మేర, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అధికారులే గమనించుకోవాలన్నారు. పంచాయితీ అధికారులు, పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తే గ్రామాలలో 90 శాతం సమస్యలు అక్కడే పరిష్కారం అయి ప్రజలు సొమ్ము, సమయం వెచ్చించి ఇంత దూరం వచ్చే అవసరం ఉండబోదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో సమస్యలు ఎక్కడవి అక్కడే పరిష్కారం కాకుడా ఉండడానికి మొదటి కారణం సంబంధిత అధికారులు పనిచేసే ప్రాంతంలో నివాసం ఉండకపోవడమేనని కలెక్టర్ చెప్పారు. ఎక్కడో దూర ప్రాంతంలో నివాసం ఉంటూ గ్రామాలకు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వెళుతుంటే అధికారులకు సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ప్రశ్నించారు. గ్రామాలకు వెళుతుంటే చెత్తకుప్పలు, మురుగునీరు, అందులో పందులు, కుక్కలు స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. అధికారులు పనిచేసే చోట నివాసం ఉండకపోతే తాను ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, డి ఆర్‌వో సత్యనారాయణ, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, డిపివో ఎం వెంకటరమణ, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు, సమాచార శాఖ ఎడి కె సుభాషిణి, సంఘిక సంక్షేమ శాఖ డిడి రంగలక్ష్మీదేవి, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల, డి ఇవో రేణుక, డి ఆర్‌డి ఏ పిడి శ్రీనివాసులు, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి కె రమేష్ తదితరులు పాల్గొన్నారు.