పశ్చిమగోదావరి

చంద్రబాబు ముందుచూపుతోనే గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, జూలై 16: ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు, సరైన కార్యాచరణ ప్రణాళిక వలననే ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఆచంట నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. పెరవలి నుంచి బైకు ర్యాలీ ప్రారంభమై పెనుగొండ వరకు కొనసాగుతుందన్నారు. పెనుగొండ-సిద్దాంతం రహదారిని ప్రారంభించి, పశువుల ఆసుపత్రి భవన నిర్మాణానికై భూమిపూజ చేస్తారని తెలిపారు. పెనుగొండలో నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొంటారని తెలిపారు. అనంతరం మార్టేరులో బ్రిడ్జిని ప్రారంభిస్తారని, ఆలమూరు, కొయ్యేటిపాడు రోడ్డును, నేలమూరు పంచాయతీని ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆచంట, పెనుగొండ ఏఎంసీ ఛైర్మన్‌లు ఉప్పలపాటి సురేష్‌బాబు, సానబోయిన గోపాలకృష్ణ, గుత్తుల లోకేష్, పితాని శేఖర్, పమ్మి రవికుమార్, రొంగల రవికుమార్, చీకట్ల భారతి, స్టాలిన్, గణపతినీడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ సెంట్రల్ లైబ్రరీని పరిశీలించిన అసెంబ్లీ కమిటీ
పాలకొల్లు, జూలై 16: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర గ్రంథాలయాన్ని పరిశీలించినట్లు కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ తెలిపారు. గ్రంథాలయాల్లో పౌరాణిక గ్రంథాలు, రామాయణ, మహాభాగవతం సంపుటిలను, తాళపత్ర గ్రంథాలను, సిడి రూపంలో పాఠకులకు అందుబాటులో ఉంచారని ఆయన వెల్లడించారు. పురాతన పుస్తకాలన్నీ బైండింగ్ చేసి భద్రపరిచారన్నారు. గ్రంథాలయంలో 91,438 పుస్తకాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు దిన, వార, మాస పత్రికలను పాఠకులకు అందుబాటులో ఉంచారన్నారు. 2017-18లో పదివేలకు పైగా పాఠకులు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకున్నట్లు టీటీడీ అధికార్లు తెలిపారని ఆయన వివరించారు. అనంతం పద్మావతి అతిథి గృహంలో కమిటీ సమావేశం జరిగిందని, జెఇఓ విభాగం అన్ని విషయాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమకు చూపారని అంగర వెల్లడించారు. గ్రంథాలయ నిర్వహణకు, భద్రతకు రూ. 40 కోట్లు కేటాయించామని ఎగ్జిక్యూటివ్ అఫీసర్ తమ కమిటీకి చెప్పినట్లు ఆయన వివరించారు. ఈ బృందంలో ఎమ్మెల్సీ గాలి శ్రీనివాస్, ఎమ్మెల్యే పరుచూరి సాంబశివిరావు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ పి భాస్కర్, తదితర్లు పాల్గొన్నారు.