పశ్చిమగోదావరి

62వేల మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 17 : జిల్లాలో సిద్ధాంతం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు గల జాతీయ రహదారి డివైడర్‌పై 62 వేల మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సిద్ధాంతం నుండి హనుమాన్ జంక్షన్ వరకు ఉన్న డివైడర్లపై మొక్కలు లేని కారణంగా రాత్రిపూట వాహనాల లైటింగ్ వెలుతురు వల్ల ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్లు ఇబ్బందులుపడుతున్నారని దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకావకాశాలున్నాయని, దీని దృష్ట్యా గుండుగొలను నుండి సిద్ధాంత వరకు గల జాతీయ రహదారి డివైడర్లపై 42 వేల మొక్కలు, గుండుగొలను నుండి హనుమాన్ జంక్షన్ వరకు 20 వేల మొక్కలను ఈ నెల 24వ తేదీకల్లా నాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపే వారిని గుర్తించేందుకు మరింత ఎక్కువ సంఖ్యలో తనిఖీలు నిర్వహించారు. గత ఏప్రిల్ నెలలో 1302 కేసులు నమోదుచేయగా 130 మందికి జైలుశిక్ష పడిందని, అయితే జూన్ నెలలో కేవలం 1279 కేసులునమోదై, 73 మందికి జైలుశిక్ష పడిందన్నారు. గత జనవరి నుండి 6821కేసులు నమోదు చేయగా 564 మందికి జైలుశిక్షపడి 39 లక్షల అపరాధ రుసుం విధించడం జరిగిందన్నారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద బస్‌లుకోసం వేచి ఉండే ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా వుంటోందని ఆ ప్రాంతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం వున్న దృష్ట్యా ఆటోనగర్ ప్రవేశమార్గం దగ్గర బస్‌షెల్టర్ ఆగస్టు 3వ తేదీనాటికి ఏర్పాటు చేయాలని జాతీయ రమదారి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత వరకు హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనం నడిపే లక్షా 31 వేల మందిపై కేసులునమోదు చేయడం జరిగిందని, ఈ విషయంపై మరింత శ్రద్ధ వహించాలని రవాణా పోలీసు అధికారులను ఆదేశించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడే వ్యక్తులను శిక్షించడంతోపాటు ఆ వ్యక్తులకు మద్యం అమ్మిన దుకాణదార్ల పర్మిట్లను రద్దుచేస్తామని హెచ్చరించారు. జిల్లాలో గుండుగొలను నుండి కొవ్వూరు వరకు గల జాతీయ రహదారిపై వాహనాలు వేగాన్ని గమనించేందుకు ఆయా ప్రాంతాల్లో మూడు ప్రత్యేక ఆటోమేటిక్ లేజర్ గన్స్ ఏర్పాటుచేయాలన్నారు. అదే విధంగా కొత్తగా వేసిన 216 జాతీయ రహదారి, 265 జాతీయ రహదార్లపై కూడా రెండేసి ప్రాంతాల్లో ప్రత్యేక ఆటోమేటిక్ లేజర్ గన్స్ ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొవ్వూరు డివిజన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా విషయంపై సంబంధిత ఆర్‌డివో, డిఎస్‌పిలుసరైన రీతిలో నియంత్రణా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోతే సహించేది లేదన్నారు. సమావేశంలో జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్, ఉప రవాణా కమిషనర్ సత్యనారాయణమూర్తి, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.