పశ్చిమగోదావరి

25న మన్యం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 17 : గిరిజన విశ్వవిద్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23, 24 తేదీల్లో ఏజెన్సీలో విద్యాసంస్థల బంద్, 25న మన్యం బంద్‌ను జరుపుతున్నట్లు ఎపి గిరిజన సంఘం, అఖిల భారత విద్యార్ధి ఫెడరేషన్, ఏజెన్సీ యువజన సంఘాల నాయకులు ప్రకటించారు. మంగళవారం స్థానిక ఎస్ ఎఫ్ ఐ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన మన్యం బంద్ వాల్‌పోస్టర్లను గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి తెల్లం రామకృష్ణ అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్శిటీని వెంటనే ఏర్పాటు చేయకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వం గిరిజనులను నిలువునా మోసం చేశారని విమర్శించారు. తక్షణమే యూనివర్శిటీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధులు తక్కువ సంఖ్యలో వున్నారనే నెపంతో ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యాసంస్థలను మూసివేయడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఏజెన్సీ విద్యాసంస్థల్లో కనీస వౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు పి సాయి కృష్ణ, డివై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి జి శివకుమార్, యువజన సంఘాల నాయకులు రవి, సహదేవుడు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు కె అనిల్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పోలోజు నాగేశ్వరరావు, తెల్లం దుర్గ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పట్టిసం మోటార్లు నిలిపివేత
పోలవరం, జూలై 17: పట్టిసం ఎత్తిపోతల పథకంలోని మోటార్లను మంగళవారం తెల్లవారుఝామున నిలిపివేశారు. గత నెల 14న గోదావరి నదికి నీటి మట్టం పెరగటంతో ఎత్తిపోతల వద్ద నీటి మట్టం 14 మీటర్లు దాటడంతో నాలుగు మోటార్లను ఆన్‌చేసి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి నీటికి కృష్ణా డెల్టాకు తరలించటం ప్రారంభించారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజ్ వద్దనుంచి వరద నీరు అధికంగా రావటంతో అక్కడ నుంచి సముద్రంలోకి నీరు వదులుతుండటంతో పట్టిసంలోని మోటార్లను నిలిపివేశారు. అయితే కుడి కాలువలోని ప్రవాహం ఆగిపోకుండా ఉండేందుకు రెండు మోటార్లను ఆన్‌చేసి కుడి కాలువలోనికి 700 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. తొలుత నాలుగు మోటార్లు ఆన్‌చేసి, అంచలంచెలుగా మోటార్లను పెంచుకుంటూ 24 మోటార్ల ద్వారా రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని తరలించేవారు. గత పది రోజుల నుంచి వర్షాల కారణంగా 15కు తగ్గించి, రోజుకు 4,250 క్యూసెక్కుల నీటిని తరలించేవారు. అయితే కృష్ణా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటిని వదులుతుండటంతో పట్టిసం ఎత్తిపోతలలోని మోటార్లను నిలిపివేశారు. ఈ నెల రోజుల్లో పట్టిసం ఎత్తిపోతల ద్వారా 14.76 టీఎంసీల నీటిని కృష్ణా జిల్లాకు తరలించినట్టు ఈఈ ఎం శంకరరావు తెలిపారు. మోటార్లను తాత్కాలికంగా నిలిపివేశామని, వర్షాలు తగ్గిన అనంతరం మోటార్లను ఆన్ చేస్తామని చెప్పారు.