పశ్చిమగోదావరి

జాతీయ అత్యుత్తమ ఆక్వా రైతుగా ఉద్దరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 17: కేంద్ర ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతిష్టాత్మక అవార్డులను అందచేసింది. ఈ అవార్డులకు ఆయా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రైతులను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత 40 ఏళ్ళుగా ఆక్వారంగానికి విశేష సేవలందిస్తున్న ఆనంద గ్రూప్ చైర్మన్, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజును ఎంపిక చేసింది. జాతీయ అత్యుత్తమ ఆక్వా రైతు అవా-2018ని ఆయనకు భీమవరంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు అందచేసింది. ఈ సందర్భంగా ఆక్వా ప్రొఫెషన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఆక్వా డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆనంద గ్రూప్ సిబ్బంది సంయుక్తంగా మంగళవారం ఆయనను సన్మానించారు. ఎన్‌ఎఫ్‌డీబీ డైరక్టర్ జనార్ధన్, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, సూర్యమిత్ర చైర్మన్ యిర్రింకి సూర్యారావు, ఆక్వా ప్రొఫెషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అమరనేని శ్రీనివాస్, కోశాధికారి ఎస్ రాజారామం, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చిలుకూరి కృష్ణంరాజు, జుంగాదాస్, కేరళ ఫిషరీస్ యూనివర్సిటీ మాజీ వైఎస్ ఛాన్సలర్ మోహన్‌కుమార్ నాయర్ తదితరులు పాల్గొన్నారు. ఆక్వా రంగంలో రాణిస్తున్న విశ్వనాధరాజు సోదరులు ఉద్దరాజు పద్మనాధరాజు, ఉద్దరాజు రామకృష్ణంరాజు, ఉద్దరాజు రమేష్‌రాజు తదితరులను కూడా ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత విశ్వనాధరాజు మాట్లాడుతూ గత 40 ఏళ్ళుగా అకుంఠిత దీక్షతో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేశామని, అంతర్జాతీయంగా ఆక్వా రంగానికి భీమవరం ఆక్వా హబ్‌గా మారిందన్నారు. రానున్న రోజుల్లో ఆక్వా రైతాంగం ఈ రంగాన్ని కాపాడుకునేందుకు కృషిచేయాలని కోరారు.
ఉద్ధృతంగా కొవ్వాడ కాలువ
తాళ్లపూడి, జూలై 17: మండలంలోని రాఘవులపల్లి-తాడిపూడి మధ్యగల రహదారిలో కొవ్వాడ కాలువ నుంచి వచ్చే వరద నీటి ఉద్ధృతి మరింత ఎక్కువైంది. ఈ రెండు గ్రామాలకు మధ్యగల కల్వర్టుపై నీరు అధిక మొత్తంలో ప్రవహించడంతో మంగళవారం కూడా ఈ గ్రామాల మధ్య రాకపోకలు జరగలేదు. గత రెండురోజుల కంటే ప్రవాహం మంగళవారం ఎక్కువైంది. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ ఇది కొవ్వాడ వరద నీరు కాదని, ఎగువనున్న చెరువులు పొంగటంతో ఈ నీరు పొలాల మీదుగా వస్తుందని, కొవ్వాడ వరద నీరు అవుట్‌ఫాల్ స్లూయిజ్ ద్వారా గోదావరిలో వెళుతుందన్నారు. అయితే కొవ్వాడ కాలువలో గుర్రపుడెక్క నిండిపోవడంతో కొన్నిచోట్ల కాలువ పొంగి ఆ నీరు కూడా పొలాల మీదుగా ప్రవహిస్తుందని ఇరిగేషన్ అధికారులు అభిప్రాయపడ్డారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కొవ్వూరు, జూలై 17: కొవ్వూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పరిచి ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. మంగళవారం కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో జరిగిన గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ కుమారదేవం గ్రామంలో 9కోట్ల 84లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని, డ్రెయినేజీ వ్యవస్థను బాగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వాలీబాల్ కిట్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, టీడీపీ నాయకులు జేవీఎస్ చౌదరి, వి రాజ్యలక్ష్మి, డీవీ రాఘవులుతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్హత ఉంటే అందరికీ సంక్షేమ ఫలాలు
ఆచంట, జూలై17: అర్హత ఉంటే అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కొంతమంది అర్హత లేకపోయినా ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేయడం వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనాశాఖా మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కరుగోరుమిల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గ్రామ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలకు కూడ ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఉన్నతపాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని విద్యార్థులు మంత్రి పితాని దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన అధికారులతో మాట్లాడి రేపటినుండి మరుగుదొడ్లు నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ పర్యటనలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆచంట ఏఎంసీ ఛైర్మన్ ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపీపీ మేకా పద్మకుమారి, జడ్పీటీసీ బండి రామారావు, డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్ కండిబోయిన సత్యనారాయణ, డిసి తమ్మినీడి ప్రసాద్, సర్పంచ్ ముత్తాబత్తుల రామచంద్రుడు, సొసైటీ అధ్యక్షులు సలాది మురళీకృష్ణ, టీడీపీ నాయకులు కేతా మీరయ్య, దొంగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.