పశ్చిమగోదావరి

పశ్చిమ గోదావరికి ఏం చేశారు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తం సీట్లలో గెలిపించినా ప్రయోజనం శూన్యం:చంద్రబాబును నిలదీసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నరసాపురం, ఆగస్టు 10: గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచేలా చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నాలుగున్నరేళ్లలో ఏంచేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలదీశారు. అసలు పశ్చిమ గోదావరి జిల్లా 15 సీట్లతో అండగా నిలవకపోతే మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా, మీ అబ్బాయి మంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా నరసాపురం అంబేద్కర్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి అనుభవంతో కూడిన పాలన కావాలని గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు మద్దతిచ్చానని, అయితే ఆయన అనుభవం సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి ఏ మాత్రం పనికిరాలేదన్నారు. ఆయన అనుభవం ఎమ్మెల్యే మహిళా అధికారిపై దాడిచేస్తే వారిని ఏమీ చేయకుండా కాపాడటానికి ఉపయోగపడిందన్నారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. చుట్టూ గోదావరి కాలువలు ఉన్నా మంచినీరు కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. ప్రజలకు ఏ మాత్రం మేలుచేయని తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో క్వారీల్లో పేలుళ్లు జరిగి పదుల సంఖ్యలో చనిపోతే జనసేన వెళ్లేదాకా రాష్ట్ర ప్రభుత్వంలో, యంత్రాంగంలో కదలికలేదని దుయ్యబట్టారు. అన్ని రాజకీయ పార్టీల్లాగా కేవలం ఓట్లు కావాలని జనసేన రాలేదన్నారు. తెలుగుదేశం పాలన చూశారు, వైసీపీ పద్ధతి చూశారు, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అడ్డంకులు కల్పించినా, జనం పక్షాన జనసేన పోరాడుతుందని గ్రహించాలన్నారు.‘ఎదగడానికి ఎందుకు రా తొందర, ఎదర బతుకంతా చిందరవందర’ అని భావించే తత్వం తనదని, 2019లో తనను ముఖ్యమంత్రి చేయాలనుకుంటే జనసేనకు అండగా నిలవాలని కోరారు. ప్రజలకు మేలు చేస్తారని టీడీపీకి అనుకూలంగా మాట్లాడితే, తెలుగుదేశం తోకపార్టీ జనసేన అని ముద్ర వేశారన్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వైసీపీతో కలిసిపోయందని ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు బీజేపీకి వత్తాసు పలుకుతోందని ప్రచారం చేస్తున్నారని, అసలు వారందరికీ వత్తాసు పలకాల్సిన అవసరం తనకేమిటని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను మాత్రమే తాఋ వెనకేసుకు వస్తానని స్పష్టంచేశారు. అధికారంలోకి వస్తే ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై వశిష్ట వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామని గొప్పలు చెప్పుకుటుంన్న పాలకులు పట్టణంలోని చెత్తను గోదావరి నది పక్కనే వేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. నరసాపురం పట్టణంలోని 32 టన్నుల చెత్తను నిత్యం గోదావరి నది పక్కన వేయడంతో పవిత్ర గోదావరి కలుషితమవుతోందని, ప్రజలు తీవ్ర ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
నరసాపురంపై జనసేనాని వరాల జల్లు
జనసేనాని పవన్ కళ్యాణ్ నరసాపురం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గాన్ని టూరిజం హబ్‌గా మార్చడంతో పాటు మత్స్యకారుల జీవనోపాధికి ఫిషింగ్ హార్బరు, యువత ఉపాధికి పరిశ్రమల స్థాపన, చేనేత పార్కు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తీర ప్రాంతంలోని నరసాపురం నియోజకవర్గం పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశమని, పరిశ్రమలు స్థాపించి ఉపాధి చూపవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలను ముడుపుల పేరుతో టీడీపీ ప్రజా ప్రతినిధులు వేధిస్తున్నారని ఆరోపించారు. 2019లో ప్రజలు జనసేన పార్టీకి అధికారం కట్టబెడితే తీరంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. అలాగే మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. తీరంలో ఫిషింగ్ హార్బర్, పడవల పరిశ్రమ నిర్మిస్తామన్నారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చేనేత పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. మామిడి రైతుల కోసం కోల్డు స్టోరేజీ నిర్మిస్తామన్నారు. లేసు అల్లికల మహిళలు ఆదాయం పెంచుకునేందుకు వీలుగా వృత్తి నైపుణ్యంపై మెరుగైన శిక్షణ ఇప్పిస్తామన్నారు. సభలో జనసేన పార్టీ నాయకులు కలవకొలను తులసీరావు, కనకరాజు సూరి, ఇర్రింకి సూర్యారావు, యర్రా నవీన్, కె చిదంబరం, మైల వీర్రాజు, బర్రె జయరాజు, డాక్టర్ ఐ ప్రకాష్, డాక్టర్ చినిమిల్లి అప్పాజీ, అందే రవికుమార్, పోలిశెట్టి జిజి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, చల్లా దానయ్య నాయుడు, మెరిపే దివ్యశ్రీ, కోపల్లి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

మొగల్తూరు చేరిన పవన్ ప్రజా పోరాట యాత్ర
మొగల్తూరు, ఆగస్టు 10: జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర శుక్రవారం మొగల్తూరు మండలంలో అభిమానులు, కార్యకర్తల మధ్య ఘనంగా సాగింది. యాత్రకు సంబంధించిన వివరాలు ముందుగా ప్రకటించనప్పటికీ అభిమానులు స్వచ్ఛందంగా భారీగా తరలిరావటం విశేషం. మొగల్తూరు మండలం జగన్నాథపురం, కాళీపట్నం, కొత్తోట, ముత్యాలపల్లి, మొగల్తూరు మీదుగా నరసాపురం మండలంవైపు సాగింది. మండలంలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్‌కు అభిమానులు, కార్యకర్తలు వందలాది మంది పార్టీజెండాలు చేతబూని ఘనస్వాగతం పలికారు. అదే సమయంలో కురిసిన భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొనటంతో పవన్ పోరాట యాత్ర ముందుకు సాగింది. మొగల్తూరు మండలం జగన్నాథపురం నుండి కాళీపట్నం, కొత్తోట, ముత్యాలపల్లి, మొగల్తూరు వరకు భారీ వర్షం కురవగా, ఆ వర్షంలోనే అభిమానులు తడుస్తూ యాత్రలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అమ్మమ్మ ఊరైన మొగల్తూరు గ్రామంలోకి యాత్ర ప్రవేశించిగానే మొగల్తూరు శ్రీదేవి జానకి సినిమాస్ అధినేత కలిదిండి అప్పలకృష్ణంరాజు (రాంబాబు) తన అనుచర వర్గంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలిసి గజమాలతో ఘనస్వాగతం పలికారు. మండలంలో దారి పొడవునా జనసేన నాయకులు మైల వీర్రాజు, బర్రి జయరాజులకు చెందిన భారీ ప్లైక్సీలు పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలుకుతూ కన్పించాయి.