పశ్చిమగోదావరి

నాలుగు రోజులుగా కుండపోత వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, ఆగస్టు 13: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి మండలంలోని ప్రజానీకం ఎదుర్కొంటున్నారు. జోరు వాన, వాగులు పొంగుతుండటంతో పలు రహదారులకు అంతరాయాలు ఏర్పడటంతో వివిధ రకాల వ్యాధుల భారినపడినవారు మండల కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి లేక ఆయా ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలతోనే తాత్కాలిక వైద్యం చేయించుకుంటున్నారు. దీనివల్ల వ్యాధి తీవ్ర తరమై ప్రాణాపాయస్థితికి చేరుకునే పరిస్థితులు దాపురించాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..వాగులు పొంగటం, గోదావరి వరద పెరుగుతుండటంతో వరదలు ముంచెత్తి గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోననే ఆందోళనను మండల వాసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలేరుపాడు మండలంలో సాగుచేసిన వివిధ రకాల పంటల పరిస్థితి దయనీయంగా మారిని పరిస్థితి విధితమే. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కనీసం వైద్య బృందాలను గ్రామాలకు తరలించి, వైద్య సేవలు అందజేయటంతోపాటు నిత్యావసర వస్తువుల సరఫరా సైతం ప్రభుత్వమే చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పొంగి ప్రవహిస్తున్న డ్రెయిన్లు
మొగల్తూరు, ఆగస్టు 13: బంగాళఖాతంలోఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మొగల్తూరు మండలంలో సోమవారం చిరుజల్లులు పడుతున్నాయి. తీర గ్రామాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని మొగల్తూరు మత్య్సశాఖ అధికారి కొత్త రమణకుమార్ హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. కాగా వర్షాల కారణంగా మండలంలో మొగల్తూరు, గొంతేరు, బొంతేరు, మాగలేరు, వెస్ట్‌కుక్కులేరు, యనమదుర్రు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. కెపి పాలెం, పేరుపాలెం, పాతపాడులో పోలీసులు పహారా కాస్తున్నారు.