పశ్చిమగోదావరి

కొత్తూరు కాజ్‌వే పైకి వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఆగస్టు 13: పోలవరం మండలం కొత్తూరు కాజ్‌వేపైకి గోదావరి వరద నీరు మూడడుగల మేర చేరటంతో 19 గ్రామాలకు రాకపోకలు సోమవారం నుంచి స్తంభించిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సులు రద్దుకావటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆటోలు, బైక్‌లపై రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి వరద గంటకు 2 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతోంది. పోలవరం సీడబ్ల్యూసీ కార్యాలయం వద్ద గోదావరి నీటి మట్టం 10.57 మీటర్లకు చేరింది. మండలంలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో నిత్యావసర వస్తువులు ఆయా గ్రామాలకు తరలించినట్టు పోలవరం తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. అలాగే వైద్య బృందాలు ఆయా గ్రామాల్లో ఉండి వైద్య సేవలందజేస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు. కొత్తూరు కాజ్‌వేపై మూడడుగుల నీరు ఉండటంతో పడవలు ఏర్పాటుచేసే అవకాశం లేదని, వరద మరింత పెరిగినట్లయితే ప్రజల రాకపోకలు సాగించేందుకు పడవలను ఏర్పాటుచేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఆదివారం పోలవరం గ్రామంలో 44.8 ఎంఎం వర్షపాతం నమోదైంది. దీంతో కొవ్వాడ కాలువ పొంగి పట్టిసం వద్దనున్న అవుట్‌ఫాల్స్ స్లూరుూజ్ ద్వారా గోదావరిలో కలుస్తోంది. గోదావరి వరద నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ మంగళవారం సాయంత్రం వరకూ పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

గోదావరిలోకి భారీగా వరదనీరు
కొవ్వూరు, ఆగస్టు 13: గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి ఉపనదులు కినె్నరసాని, తాలిపేరు, పెదవాగు మొదలైన ఉప నదులు పొంగి పొర్లడంతో నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాజమహేంద్రవరం గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సోమవారం సాయంత్రం 8.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 35.50 అడుగుల వరద నీటిమట్టం నమోదైందని, ధవళేశ్వరం బ్యారేజీ నుండి 5 లక్షల 84 వేల 816 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. తూర్పు డెల్టాకు 4,100, మధ్య డెల్టాకు 1500, పశ్చిమ డెల్టాకు 2,000 మొత్తం 7,600 క్యూసెక్కుల నీటిని కాలువలోకి వదిలినట్టు తెలిపారు. ఈ వరద మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇలావుండగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని స్నానఘట్టంలోకి వరద నీరు చేరి, స్నాన ఘట్టంలో ఉన్న శివలింగాన్ని వరద నీరు తాకింది. గోష్పాద క్షేత్రంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది.