పశ్చిమగోదావరి

పరిహారం చెల్లించాక కేసులు పెడతారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఏప్రిల్ 26: ‘ఆధారాలు తెచ్చుకోమన్నారు..ప్యాకేజీ చెల్లించాక గ్రామాన్ని ఖాళీ చేశాం..తమ ఇళ్లు కూల్చేశారు..ఇప్పుడు ప్యాకేజీ చెక్కులు వెనక్కి ఇవ్వమని పోలీసులు తమపై కేసులు పెట్టారని’ పైడిపాక నిర్వాసితులు వాపోయారు. నకిలీ ధ్రువపత్రాలతో ప్యాకేజీ అందుకున్నారంటూ 11మందిపై తహసీల్దార్ చేసిన ఫిర్యాదు నిర్వాసిత గ్రామాలలో కలకలం సృష్టిస్తోంది. 18 సంవత్సరాలు నిండకుండా తప్పుడు ధ్రువపత్రాలు తీసుకువచ్చి, అలాగే మరో 20మంది అటువంటి పత్రాలతో తమకూ ప్యాకేజీ ఇవ్వాలని వత్తిడి చేస్తున్నారని తహసీల్దార్ ఎం ముక్కంటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిపై పిల్లల తల్లులను మంగళవారం పోలీసు స్టేషన్‌కు రప్పించి ఎస్సై కె శ్రీహరిరావు విచారించారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు. 18 సంవత్సరాల బాలికకు ఆధారాలు చూపిస్తే ప్యాకేజీ చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పడంతో పాఠశాల ధ్రువీకరణ పత్రాలు తీసుకువచ్చి వారికి ఇవ్వడంతో అన్నీ పరిశీలించి చెక్కులు పంపిణీ చేశారని, అనంతరం పునరావాస గ్రామాలకు తరలివెళ్లిన అనంతరం తప్పుడు ధ్రువపత్రాలనే ఆరోపణలతో కేసులు బనాయించారని యల్లా కనకనమహాలక్ష్మి, వీరనాల లక్ష్మి, ఆండ్రు పాప, పెనుగొండ లక్ష్మిలు ఆవేదన వ్యక్తంచేశారు. తమలాగే చాలా మందికి తమలాగా సుమారు 30మందికి పైగా ధ్రువపత్రాలు అందజేసి ప్యాకేజీ తీసుకున్నారని, తమ 11మందిపైనా కేసులు బనాయించడంలో అంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపితే అనేక వాస్తవాలు వెలుగుచూస్తానని నిర్వాసితులు పేర్కొంటున్నారు.