పశ్చిమగోదావరి

ప్రజాప్రయోజనాలే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 13: వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, స్ధలాలు ఆక్రమణలకు గురి అయితే సంబంధిత అధికారులు వాటిని తొలగించి స్వాధీనం చేసుకోవాలన్నారు. కొన్నిప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు కొనసాగుతోందని, అయితే కొంతమంది తనకు వద్దకు వచ్చి వాటిని తొలగించరాదని అభ్యర్ధిస్తున్నారని, ఆది సరికాదన్నారు. తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రజల సౌకర్యార్ధం రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ప్రజలు దానికి సహకరించాలన్నారు. తాడేపల్లిగూడెం మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన బి రాంబాబు వినతిపత్రం ఇస్తూ గ్రామంలోని రజకసంఘం చెర్వులోని చేపలను కులవృత్తుల వారికి ఇవ్వకుండా ప్రెసిడెంట్, కమిటీ సభ్యులు విక్రయించుకుంటున్నారని, ప్రశ్నించిన తనపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఈవిషయమై పంచాయితీ అధికారులు స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. పెనుగొండకు చెందిన లక్ష్మినరసమ్మ వినతిపత్రం సమర్పిస్తూ తనకు వస్తున్న రెండుపెన్షన్లను పెనుగొండ సబ్‌ట్రజరీ అధికారులు నిలిపివేశారని పేర్కొన్నారు. తన భర్త పెనుగొండలో టీచర్‌గా పనిచేస్తూ మరణించారని, తాను పెనుగొండ జూనియర్ కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చెందగా, తన భర్తకు సంబంధించిన కుటుంబపెన్షన్, తన ఉద్యోగ విరమణ విరమణకు సంబంధించిన పెన్షన్ పొందుతున్నానన్నారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు రెండు పెన్షన్లు తీసుకోవటం చట్టవిరుద్దమని, ఇంతవరకు తీసుకున్న కుటుంబపెన్షన్ సొమ్ము వడ్డీతో సహా రికవరీ చేసి ఆమెకు రావాల్సిన పెన్షన్ మాత్రం అందజేయాలని జిల్లా ట్రజరీ అధికారులను కలెక్టరు ఆదేశించారు. ఈవిధంగా పలువురు సమర్పించిన వినతులపై కలెక్టరు స్పందిస్తూ వాటిని పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అయా శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు వేణుగోపాల్‌రెడ్డి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టరు ప్రవీణ్ ఆదిత్య, డిఆర్వో సత్యనారాయణ, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డ్వామా పిడి ఎం వెంకటరమణ, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.