పశ్చిమగోదావరి

హౌసింగ్ పీడీ, జడ్పీ సీఈవోలకు ముఖ్యమంత్రి పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 14: జిల్లా గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరెక్టరు ఇ శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో వి నాగార్జునసాగర్‌లకు ప్రతిష్ఠాత్మకమైన ముఖ్యమంత్రి పురస్కారాలు అందజేయనున్నారు. 2017-18లో మెరుగైన పనితీరు కనపర్చిన 25మంది అధికారులను రాష్టస్ధ్రాయిలో సీఎం అవార్డు కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ కేటగిరిలో జిల్లా హౌసింగ్ పీడీ ఇ శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో వి నాగార్జునసాగర్‌లు ఎంపికయ్యారు. బుధవారం శ్రీకాకుళంలో జరగనున్న రాష్టస్ధ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పురస్కారాలను వీరిద్దరికి అందించనున్నారు. జిల్లా హౌసింగ్‌లో మెరుగైన పనితీరు, ప్రశంసనీయమైన ఫలితాలు సాధించినందుకు హౌసింగ్ పిడికి అవార్డు లభించగా, గుంటూరు జడ్పీ సిఇఓగా పనిచేసిన కాలంలో మంచి పనితీరు, సమర్ధమైన ఫలితాలను సాధించినందుకు వి నాగార్జునసాగర్‌కు ఈ పురస్కారాలు అందజేయనున్నారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ జడ్పీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఉత్తమ సేవలు అందించే అధికారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచే ఈ పురస్కారాలను ప్రవేశపెట్టింది. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, అధికారుల నుంచి ఇంతకుముందే దరఖాస్తులను ఆహ్వానించారు. వాటిని పరిశీలించిన అనంతరం ఉన్నతస్ధాయి అధికారుల బృందం రాష్టవ్య్రాప్తంగా 25మందిని ఎంపికచేసింది. దీనిలో వీరిద్దరికి చోటు దక్కింది.
హౌసింగ్‌కు సంబంధించి శ్రీనివాసరావు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అయా కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకువెళ్లటంతోపాటు లబ్దిదారుల ఎంపిక, నిధుల కేటాయింపు వంటి అంశాల్లో అవసరమైన పారదర్శకత అవలంభించటంతోపాటు ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న కాలనీల నిర్మాణంలో ఆయన చురుగ్గా వ్యవహరించటం, అనుకున్న సమయానికి వాటిని సిద్ధం చేసి నిర్వాసితులకు అందించటం వంటి విషయాలపై ప్రభుత్వం ఎంతో సంతృప్తిని ప్రకటించినట్లు తెలుస్తోంది. 2014 జూలై తర్వాత జిల్లాలో దాదాపు 62914 గృహాలను నిర్మించటంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్ గృహాలు, అంతకుముందు నిర్మాణం చేపట్టిన గృహాల నిర్మాణం విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించి పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్లారు. అలాగే పెండింగ్ బిల్లుల మంజూరులో కూడా ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ -1 కింద 1582 గృహాలను నిర్మించి నిర్వాసితులను తరలించటంలో కీలకభూమిక పోషించారు. రెండవదశకు సంబంధించి దాదాపు 10వేల గృహాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించటం కూడా పూర్తి చేశారు. ఈవిధంగా రాష్ట్రానికి, జిల్లాకు ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు ముందడుగు వేయటంలో శ్రీనివాసరావు అమలుచేసిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు ఎంతో ఉపకరించాయని ప్రభుత్వం గుర్తించింది. ఈఫలితంగానే ముఖ్యమంత్రి పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇక జిల్లా పరిషత్ సిఇఓగా పనిచేస్తున్న వి నాగార్జునసాగర్ గతంలో గుంటూరు జడ్పీ సిఇఓగా పనిచేసిన సమయంలో ఓడిఎఫ్ అమలు, పంచాయితీరాజ్ శాఖ పరిధిలో పలు అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లటంలో చురుకైన పాత్ర పోషించారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా లబ్దిదారులకు సకాలంలో ఫలాలు అందించటంలో ఆయన తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని సమాచారం. అంతకుముందు పలు జిల్లాల్లో జిల్లా పంచాయితీ అధికారిగా పనిచేసిన సమయంలో కూడా నాగార్జునసాగర్ సమర్ధుడైన అధికారిగా పేరొందారు. ఈనేపధ్యంలో పరిపాలనావిభాగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి పురస్కారానికి ఆయనను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది.