పశ్చిమగోదావరి

కొత్తూరు కాజ్‌వే పైనుండి పడవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఆగస్టు 14: కొత్తూరు కాజ్‌వేపై గోదావరి వరద నీరు 5 అడుగుల మేర చేరడంతో ప్రజల రాకపోకలు రెండవ రోజు మంగళవారం కూడా నిలిచిపోయాయి. కాజ్‌వే వద్దకు వెళ్లిన తహసీల్దార్ రవికుమార్ నాటు పడవను ఏర్పాటుచేసి ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. పోలవరం నుంచి ఆటోలపై కాజ్‌వేపై చేరుకున్న ప్రజలు అక్కడ ఏర్పాటుచేసిన పడవపై కాజ్‌వే దాటి ప్రయాణాన్ని అంచెలంచెలుగా సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా..గోదావరి నీటి మట్టం పెరుగుతూనే ఉంది. శనివారం సాయంత్రం నుంచి నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ పోలవరం సీడబ్ల్యూసీ వద్ద 11.55 మీటర్లకు చేరింది. పోలవరంలో సోమవారం 28.2 ఎంఎం వర్షపాతం నమోదైంది. కొవ్వాడ కాలువ పొంగి వరద నీరు పట్టిసం వద్దనున్న అవుట్ ఫాల్స్ స్లూయిజ్ నుంచి గోదావరిలోకి కలుస్తోంది. గోదావరికి వరదల కారణంగా టూరిజం బోటులతోపాటు పెర్రీ పాయింట్ వద్ద ప్రయాణికులను నదిని దాటించే లాంచీలను అధికారుల ఆదేశాల మేరకు నిలిపివేశారు. పాత పట్టిసం వీరేశ్వర స్వామి ఆలయం చుట్టూ గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాల తగ్గటంతో గోదావరి నదికి వరద తగ్గే అవకాశం ఉంది.