పశ్చిమగోదావరి

48 పాఠశాలలకు ప్రహారీ గోడల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 16: జిల్లాలో 48 పాఠశాలలకు ప్రహారీగోడల నిర్మాణానికి మంజూరు ఉత్తర్వులు ఇస్తున్నట్లు కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ తెలిపారు. స్దానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాప్రగతిపై అధికారులతో ఆయన సమీక్షిస్తూ ప్రహారీగోడ లేని పాఠశాలలకు దశలవారీగా వాటిని నిర్మిస్తామన్నారు. వివిధ పాఠశాలల్లో ఆటస్ధలాల అభివృద్ధి, ఇతర వౌలిక సదుపాయాల పనులు వారంరోజుల్లో పూర్తి చేసేందుకు మండల విద్యాశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. అదేవిధంగా కెవిబి భవననిర్మాణలు కూడా వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డిజిటల్ క్లాస్‌ల నిర్వహణకు అవసరమైన స్టూడియో ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. వివిధ పాఠ్యాంశాల్లో వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి వారికి నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతుల్లో బోధన ఆ విద్యార్ధులు అర్ధం చేసుకునేరీతిలో ఉండాలన్నారు. మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులకు నెలవారీ చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టరు ఆదిత్య ప్రవీణ్, డిఇఓ సివి రేణుక, సర్వశిక్ష అభియాన్ పిఓ బ్రహ్మనందరెడ్డి, డిప్యూటీ డిఇఓలు, ఎంఇఓలు పాల్గొన్నారు.
నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి
జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ పౌరసరఫర అదికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సాంఘిక, బిసి వసతిగృహాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్వర్ణరకంలో సన్నబియ్యాన్ని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈవిషయమై రైస్‌మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని జెసి వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. జిల్లాలో స్వర్ణరకం సన్నబియ్యం ఏప్రాంతంలోని రైస్‌మిల్లుల్లో ఉందో గుర్తించాలన్నారు. గతంలో ఇదే విషయంపై పౌరసరఫరాల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయగా ఒక ఏడాదిపాటు దాన్ని అమలుచేశారని, అయితే ఇటీవల తిరిగి లావుబియ్యం సరఫరా చేస్తున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తిరిగి ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, సంవత్సరంపాటు నిల్వ ఉన్న పాత సన్నబియ్యాన్ని పూర్తి నాణ్యత ఉండేలా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు వేణుగోపాల్‌రెడ్డి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టరు ఆదిత్య ప్రవీణ్, డిఎస్‌ఓ మహ్మద్ యాసిన్, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.