పశ్చిమగోదావరి

యూనిట్లు కచ్చితంగా నెలకొల్పేలా చూడాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 16: జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ద్వారా లక్ష్యానికి మించి లబ్దిదారులకు మంజూరు చేసిన 35వేల యూనిట్లను కచ్చితంగా నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్దానిక కలెక్టరేట్‌లో గురువారం జ్ఞానభూమి, వసతిగృహాల నిర్వహణ, సంక్షేమ యూనిట్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వివిధ సంక్షేమశాఖల ద్వారా 21796 ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం కాగా లక్ష్యానికి మించి 34720 యూనిట్లు మంజూరు చేశామన్నారు. వీరిలో ఇప్పటికే 34322 మందికి ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసుకునేందుకు సంబంధిత బ్యాంకులకు జాబితాలు పంపించామన్నారు. పెరిగిన లక్ష్యాలపై చర్చించేందుకు ఈనెల 21వ తేదీ సాయంత్రం 4గంటలకు బ్యాంకర్ల సమావేశం ఏర్పాటుచేయాలని ఎల్‌డిఎంను ఆదేశించారు. ఉపాధి యూనిట్లు మంజూరు అయిన లబ్దిదారులతో బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తే లబ్దిదారుల సబ్సిడీని విడుదల చేస్తామన్నారు. జిల్లాలోని సాంఘిక, బిసి సంక్షేమ వసతగృహాలను వారంలో రెండురోజులు సంబంధిత ఎఎస్‌డబ్ల్యుఓలు, రెండురోజులు హాస్టల్ వార్డెన్లు, ఒకరోజు ప్రత్యేక అధికారులు ఖచ్చితంగా సందర్శించాలన్నారు. జెఎన్‌బి నివాస్ కింద వసతిగృహాల్లో విద్యార్ధుల బయోమెట్రిక్ హాజరును పొందుపర్చాలన్నారు. జిల్లాలో వివిధ సంక్షేమ వసతిగృహాల మరమ్మత్తు పనులను వారంరోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టరు ఆదిత్యప్రవీణ్, పంచాయితీరాజ్ ఎస్‌ఇ మాణిక్యం, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మిదేవి, ఎల్‌డిఎం సూర్యారావు, ఎస్సీ కార్పోరేషన్ ఇడి రమేష్, బిసి కార్పోరేషన్ ఇడి పుష్పలత, విభిన్నప్రతిభావంతుల సంక్షేమశాఖ ఎడి ప్రసాదరావు, మైనార్టీ సంస్ధ అధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

గ్రామదర్శినిలో సమస్యలు యాప్‌లో పొందుపర్చాలి
*కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఆగస్టు 16: జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీలో గురు,శుక్రవారాల్లో నిర్వహించే గ్రామదర్శిని సభల్లో ప్రజాసమస్యలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో పొందుపర్చాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఎంపిడిఓలను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ నుంచి గురువారం ఎంపిడిఓలు, ఇఓఆర్‌డిలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ పంచాయితీల ప్రత్యేకాధికారులు, ఇతర అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రజాఫిర్యాదులను నమోదు చేసుకుని ఆన్‌లైన్ ద్వారా పంపాలన్నారు. పరిష్కరించదగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కాని సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు నివేదికను ఆన్‌లైన్ ద్వారా పంపాలన్నారు. గ్రామీణప్రాంతాల్లో ఇళ్లు కావాలని ఎవరైనా కోరితే వారిలో అర్హులకు వెంటనే మంజూరు చేస్తామన్నారు. రుణాల మంజూరు కొరకు నిర్దేశించిన లక్ష్యం మేరకు దరఖాస్తులు స్వీకరించాలని, ఇంకా అదనంగా నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతను పరిశీలించి రుణమంజూరుకు చర్యలు చేపడతామన్నారు. అక్టోబర్ 2వ తేదీనాటికి గ్రామాల్లో పూర్తిస్ధాయిలో ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటుచేస్తామని, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు అర్హతగల ప్రతిఒక్కరికి మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.