పశ్చిమగోదావరి

వాజ్‌పేయి కృషి స్ఫూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఆగస్టు 16: పరిపాలనా దక్షునిగా, దేశాభ్యుదయ కాముకునిగా మానవతావాదిగా మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి భారతదేశ అభ్యున్నతి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు నివాళులర్పించారు. అనారోగ్యంతో కన్నమూసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాప కార్యక్రమం గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. తొలుత వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు నిర్వహించి పదవికి వనె్న తెచ్చారని కొనియాడారు. దేశంలో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు వెళ్ళారన్నారు. పదవి కంటే, రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని వాజ్‌పేయి నమ్మిన గొప్ప నేతగా పేర్కొన్నారు. ఆయన మరణం దేశానికి, భారతీయ జనతా పార్టీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు, నాయకులు తాతా శ్రీనివాసరావు, కర్రి ప్రభాకర బాలాజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ పోతుల అన్నవరం, టీబీఆర్ ఇన్‌ఫ్రా చైర్మన్ టి.్భగేశ్వరరావు, కంచుమర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రిట్ పిటిషన్లు వేసిన వారిపై క్రమశిక్షణాచర్యలు
*డీసీసీబీ ఛైర్మన్ ముత్యాల రత్నం
ఏలూరు, ఆగస్టు 16: డీసీసీబీ పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు చేస్తూ రిట్‌పిటిషన్లు వేసిన యూనియన్ నాయకులపై క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని డీసీసీబీ ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) తెలిపారు. గురువారం స్ధానిక డీసీసీబీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన మహాజనసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికే ఆదర్శంగా ఉన్న పశ్చిమగోదావరి డీసీసీబీపై అవినీతి అరోపణలు చేయటం తగదన్నారు. పాలకవర్గం ఎంతో చిత్తశుద్దితో కార్యక్రమాలు అమలుచేస్తూ ముఖ్యమంత్రి ప్రశంసలు కూడా పొందిందన్నారు. శతవసంతాల వేడుకలు విజయవంతానికి సహకరించిన సిబ్బందికి, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీబీ రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తోందని చెప్పారు. న్యాయపరమైన అంశాలపై ఏ ఒక్కరూ కూడా బహిరంగంగా మాట్లాడే హక్కు లేదన్నారు. రైతులకు సహకార రుణాలు అందించటం, వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందించే బాధ్యత కూడా సహకారబ్యాంకు తీసుకుందన్నారు. జిల్లాలోని సహకారబ్యాంకుల ద్వారా అందజేసే రుణాలను అయా సొసైటీల అధ్యక్షుల సమక్షంలోనే అందజేసేందుకు తగు ఆదేశాలు జారీచేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈవో వివిఎన్ ఫణికుమార్, జీఎంలు ఎ మాధవిమూర్తి, కె శ్రీనివాస్, డీజీఎంలు డి రమణమ్మ, కె కిరణ్మయి, బి శ్రీదేవి, వైవి రాఘవేంద్రారెడ్డి, ఏజీఎంలు జిఎన్‌వి సత్యనారాయణ, బివి సుబ్బారావు, ఎస్ రాధాకృష్ణ, జి పిచ్చయ్యచౌదరి, జెఎన్‌వివి సూర్యనారాయణరావు, పాలకవర్గ సభ్యులు, సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. డీసీసీబీ పాలకవర్గానికి ఈనెల 18వ తేదీతో గడువు ముగియనుంది.