పశ్చిమగోదావరి

చట్టవిరుద్ధ పేలుళ్లు జరిపితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఆగస్టు 16: కొవ్వూరు, దేవరపల్లి మండలాల్లో ఉన్న క్వారీలలో చట్ట విరుద్ధంగా పేలుళ్లు జరిగినా, తవ్వకాలు జరిపినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ కొవ్వూరు రూరల్ పోలీసు స్టేషన్‌ను గురువారం తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ క్వారీలలో అనధికారికంగా పేలుళ్లు జరిగితే ఆ క్వారీల సమీపంలో ఉన్న ఎస్సై, సీఐలు బాధ్యులవుతారన్నారు. కొవ్వూరు, దేవరపల్లి ప్రాంతాల్లో 152 క్వారీలు ఉన్నాయని, రోజుకు 5 క్వారీలను తనిఖీ చేసి, నివేదికను పంపాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఇసుకను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. నేరాలను నివారించడానికి పోలీసులు చేపట్టిన చర్యలు, సాంకేతిక నైపుణ్యం కారణంగా జిల్లాలో నేరాలు, దొంగతనాలు, రోడ్డుప్రమాదాలు తగ్గాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదుచేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ప్రతి నెలా జిల్లాలో 12వేల నుంచి 14వేల వరకూ వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 200మందికి జైలుశిక్ష పడగా, మరి కొంతమందికి భారీగా జరిమానాలు విధించినట్టు తెలిపారు. కొవ్వూరు రూరల్ స్టేషన్ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్నాయని, నేరాలు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. అంతకు ముందు ఎస్పీ రూరల్ పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. విలేఖర్ల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ శరత్ రాజ్‌కుమార్, ఎస్సై సతీష్ ఉన్నారు.

చిన వెంకన్న ఆలయంలో...
నిత్యార్జిత కల్యాణానికి డ్రెస్ కోడ్
-పురుషులకు పంచె, కండువా -మహిళలకు చీర లేదా చుడీదార్ -సెప్టెంబర్ 1 నుంచి ఆమల్లోకి
ద్వారకాతిరుమల, ఆగస్టు 16: శ్రీవారి క్షేత్రానికి వచ్చి నిత్యార్జిత కల్యాణంలో పాల్గొనే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. ఇందు నిమిత్తం చినవెంకన్న దేవస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ ఆవరణలోని నిత్య కల్యాణ మండపంలో కల్యాణంలో పాల్గొనే దంపతులు ధరించాల్సిన దుస్తుల వివరాలను ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు విలేఖర్లకు వివరించారు. పురుషులు విడిగా పంచె, కండువా ధరించాల్సి ఉంది. మహిళా భక్తులు చీర లేదా చుడీదార్ మాత్రమే ధరించాలని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని, భక్తులు గమనించి సహకరించాలని ఈవో కోరారు.

భయపెడుతున్న గోదావరి
వేలేరుపాడు, ఆగస్టు 16: గోదావరి వరద ఉద్ధృతంగా పెరుగుతుండటంతో గురువారం వేలేరుపాడు మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఇప్పటికే సాగుచేసిన పత్తి, వరి పంటలు, మిర్చి నారుమళ్లు, యాభై శాతానికి పైగా దెబ్బతిని ఉన్నాయని, ఈ తరుణంలో తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా పైనగల ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో అన్ని గేట్లు వదిలిపెట్టారన్నారు. దీనితో గోదావరి వరద భద్రాచలం వద్ద గురువారం రాత్రికి 43 అడుగులకు చేరుకుంటుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలపడంతో స్థానిక తహసీల్దార్ రవికుమార్ వేలేరుపాడు మండలంలోని గోదావరి పరివాహక గ్రామాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తమ సిబ్బందితో అప్రమత్తం చేశారు. ఇదిలావుంటే వర్షాలు ఇంకా పడుతుండటంతో వాగులు పొంగి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరిగే ప్రమాదం లేకపోలేదు. దీనితో తమ పంట పొలాలు మునిగిపోవడమే కాకుండా గ్రామాలను సైతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందేమోనన్న భయాందోళనలో మండల ప్రజలు అల్లాడుతున్నారు.
పోలవరం వద్ద...
పోలవరం: పోలవరం వద్ద గోదావరి నది వరద తిరిగి పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి సీడబ్ల్యూసీ కార్యాలయం వద్ద నది నీటిమట్టం 11మీటర్లుగా నమోదైంది. మంగళవారం గోదావరి 11.55 మీటర్ల వరకు పెరిగి అనంతరం క్రమేపీ తగ్గుతూ గురువారం ఉదయానికి 10.34 మీటర్ల వద్దకు చేరింది. మరలా వరద వేగంగా పెరుగుతూ ప్రస్తుతం 11 మీటర్ల వద్దకు చేరింది. అలాగే కొత్తూరు కాజ్‌వేపైకి అడుగు మేర వరద నీరు చేరింది. శుక్రవారం నాటికి వరద మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
*గోదావరి తీరప్రాంత గ్రామాల్లో అప్రమత్తం:కలెక్టర్
ఏలూరు, ఆగస్టు 16: భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా జిల్లాలోని అన్ని తీరప్రాంత గ్రామాల్లో జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ తెలిపారు. తీరప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటుచేయటం జరిగిందని, ఫోన్ నెంబర్ 08812-230054కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునని కలెక్టర్ భాస్కర్ తెలిపారు.