పశ్చిమగోదావరి

విలేకరుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీలుగుమిల్లి, సెప్టెంబర్ 18: మండలంలో విధులు నిర్వహిస్తున్న పత్రికా విలేకరుల విధులకు ఆటంకం కలిగించి, దాడులు చేసిన వారిపై కేసులు నమోదుచేసి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలవరం డీఎస్పీ ఎటివి రవికుమార్ హెచ్చరించారు. మండలంలో పలు కేసుల విచారణ నిమిత్తం మంగళవారం ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ బుట్టాయగూడెం, జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేరాలకు సంబంధించిన కేసులపై సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. మండలంలో క్రైమ్ రిపోర్టు 125గా ఉందని, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ముందుకు వెళుతున్నామని, విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తామని అన్నారు. మండలంలో మొత్తం 23 వినాయక మండపాలకు అనుమతులు ఇచ్చామని, వాటిలో 16 మండపాల్లో ప్రశాంతంగా ఉత్సవాలు ముగిసి, నిమజ్జనాలు పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన మండపాల్లో కూడా ఉత్సవాలు పూర్తయి, నిమజ్జనాలు పూర్తయేంత వరకు భద్రతాచర్యలు కొనసాగిస్తామని తెలిపారు. సమావేశంలో సీఐ ఎం.రమేష్‌బాబు, బుట్టాయగూడెం ఎస్సై ఎ.ఆనందరెడ్డి, ఎస్సై జయరాజు, రైటర్లు సత్యానందం, శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

రూ. 6,150 కోట్ల వ్యాపార లావాదేవీలు
ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ సురేష్‌కుమార్
తణుకు, సెప్టెంబర్ 18: పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో ఉన్న ఇండియన్ బ్యాంకు విజయవాడ జోన్‌లో గత ఏడాది 6,150 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపినట్టు జోనల్ మేనేజర్ ఎంబి సురేష్‌కుమార్ తెలిపారు. బ్యాంకు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వ్యాపార సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది 7,500 కోట్ల రూపాయలకు వ్యాపారం పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. తమ జోన్‌లో ప్రస్తుతం యాభై శాఖలుండగా వీటిని వందకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం, పెనుగొండ, నల్లజర్లలో బ్రాంచిల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. వీటిని అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నట్టు సురేష్‌కుమార్ తెలిపారు. తణుకు బ్రాంచి పరిధిలో ఇంతకుముందు పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ఇండియన్ బ్యాంకు ఎంతగానో సహకరించిందని ఆయన వివరించారు. అదే మాదిరిగా రైస్ మిల్లింగ్ అభివృద్ధికి సహకరిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక, విద్యా, వైద్య రంగాలతో పాటు గృహ నిర్మాణాలకు, వాహనాల కొనుగోలుకు ఇండియన్ బ్యాంకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. బ్రాంచి మేనేజర్ మోరం వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జోనల్ ఆఫీస్ క్రెడిట్ విభాగం చీఫ్ మేనేజర్ వివి రమణారావు, తణుకు రైసు మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుదప చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

తృటిలో తప్పిన భారీ ప్రమాదం
ఏలూరు, సెప్టెంబర్ 18 : శివకాశి నుంచి ఒరిస్సా రాష్ట్రానికి వెళుతున్న బాణాసంచాలారీ స్థానిక ఆశ్రం ఆసుపత్రి సమీపంలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది. బాణాసంచా లారీ కావడంతో తక్షణమే లారీ డ్రైవర్ సంబంధిత అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న అధికారులు తగు చర్యలు తీసుకుని ప్రమాదం జరగకుండా నిర్మూలించారు. జాప్యం అయితే ప్రమాదం జరిగే అవకాశముందని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందడంతో అధికారులు ఫైర్ నివారణకు చర్యలు తీసుకున్నారు.