పశ్చిమగోదావరి

ఎయిడెడ్ కళాశాలలో తాత్కాలిక అధ్యాపకులకు పే స్కేలు నిర్ణయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, సెప్టెంబర్ 18: ఎయిడెడ్ కళాశాలలో తాత్కాలిక అధ్యాపకులను శాశ్వత అధ్యాపకులుగా గుర్తించి పే స్కేలు తదితర సౌకర్యాలు కల్పించాలని అసెంబ్లీలో పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మంగళవారం కోరారు. ఎంతోమంది విద్యావేత్తలు, తత్వవేత్తలు, దాతలు ప్రైవేటు విద్యాలయాలు స్థాపించారని, 1935 నుంచి భారత దేశంలో ఎంతోమంది విద్యా వ్యాప్తికి కృషి చేశారని చెప్పారు. ఈ విద్యాలయాలలో శాశ్వత అధ్యాపకుల సంఖ్య తగ్గిపోయి తాత్కాలిక ఉపాధ్యాయులే విద్యాబోధన చేస్తున్నారని, గత 20 సంవత్సరాల నుంచి తాత్కాలిక అధ్యాపకులుగా పనిచేసినవారు ఉన్నారని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాలయాలు మూతపడే పరిస్థితి ప్రమాదం ఉందన్నారు. కార్పొరేట్ కళాశాలలో పేదవారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చేరే పరిస్థితిలేదని, తక్కువ ఫీజులతో నిర్వహిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే నిమ్మల కోరారు.

మొగల్తూరులో వింత దోసకాయలు
మొగల్తూరు, సెప్టెంబర్ 18: మండల కేంద్రమైన మొగల్తూరు దయాల్‌దాస్ పేటనందు మాజీ మిలిటరీ ఉద్యోగి వై.్ధర్మారావుకు చెందిన ఖాళీ స్థలంలో పందిరిపై కాసే లంక దోసకాయలు భారీ సైజులో నేలపై కాశాయి. ఈ విషయమై ఈ ప్రాంతలో ప్రజలు వింత వింతలుగా చెప్పకుంటున్నారు. లంక దోసకాయలు ఇంత పెద్ద సైజులో కాయటం, అదీ నేలమీద కాయటం చాలా అరుదైన విషయమని పలువురు పేర్కొన్నారు. యజమాని ధర్మారావు మాట్లాడుతూ ఈ విత్తనాలు హైదరాబాద్ నుండి తెచ్చి వేశానన్నారు. అయితే లంక దోసకాయలు ఎక్కడైనా కేజీ బరువుతో అడుగున్నర పొడవు మాత్రమే వుంటాయి. ఈ దోసపాదుకు మందు కూడా వేయకుండా కేవలం నీటితో మాత్రమే పెంచామని తెలిపారు. ఈ పాదుకు పది కాయలు పైగా కాసిందని, ఒక్కొక్క కాయ రెండడుగుల పొడవుతో అయిదు కేజీలు బరువు వున్నాయని విలేఖరులకు వివరించారు.

ఎఎంసికి పదవీకాలం పెంపు
ఏలూరు, సెప్టెంబర్ 18 : ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువు ఈ నెల 4వ తేదీతో ముగిసిన నేపధ్యంలో ప్రభుత్వం అదే పాలకవర్గాన్ని ఏడాదికాలం పెంచుతూ ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఎ ఎంసి అధికారులు ఛైర్మన్ పూజారి నిరంజన్, వైస్ ఛైర్మన్ లింగిశెట్టి శశికుమార్, పాలకవర్గ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ శ్రీలత, ఉద్యోగులు సీతా సూరిబాబు, ఎస్ బాబి, నవీన్, కిషోర్, ధనరాజ్, వెంకట్ తదితరులున్నారు.