పశ్చిమగోదావరి

ఆర్‌టిసిపై పెట్రో భారం రూ. 900 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 18 : ఆర్‌టిసిపై డీజిల్ రేట్ల పెరుగుదల వల్ల ఏడాదికి 900 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతోందని ఆర్‌టిసి ఎండి సురేంద్రబాబు తెలిపారు. మంగళవారం స్థానిక బస్టాండ్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం డిపో మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో సురేంద్రబాబు మాట్లాడారు. అదే విధంగా సిబ్బంది వేతనాలు, ఇతరత్రా అలవెన్సులు కలిపి మరో 700 కోట్ల రూపాయల మేరకు ఆర్‌టిసికి భారం పడుతుందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌పై రెండురూపాయల మేరకు ధర తగ్గించడం వలన ఆర్టీసిపై 60 కోట్ల రూపాయల మేరకు భారం తగ్గిందని తెలిపారు. వాస్తవానికి ఆర్టీసీ నష్టాల్లో వున్నా దాన్ని పూడ్చుకునేందుకు ప్రజలపై భారం వేయడం లేదని చెప్పారు. 2015లో ఆర్టీసీ ధరలు పెంచామని, ఇంత వరకు ధరల పెంపు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే ఆర్టీసీ డ్రైవర్లు ఎక్కడైనా దురుసుగా ప్రవర్తించినా, మితిమీరిన వేగంతో వెళ్లినా ఆ వీడియోను తమకు పంపితే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బుజ్జి కోసం ఏమైనా చేస్తా
* ఎఎంసి ఛైర్మన్ నిరంజన్
ఏలూరు, సెప్టెంబర్ 18 : తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే ఎమ్మెల్యే బడేటి బుజ్జి తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించారని, ఆయన కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమేనని ఎఎంసి ఛైర్మన్ పూజారి నిరంజన్ అన్నారు. మంగళవారం అగ్రహారంలోని ప్రేమాన్విత మానసిక వికలాంగుల కేంద్రంలో నిరంజన్ జన్మదిన వేడుకలను జరిపారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి బుజ్జి ముఖ్య అతిధిగా హాజరై నిరంజన్‌తో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగుల కేంద్రానికి నిరంజన్ బీరువాను బహూకరించారు. ఎమ్మెల్యే బుజ్జి మాట్లాడుతూ నిరంజన్ పనితీరు చూసే పదవీకాలాన్ని కూడా పొడిగించడం జరిగిందని, పార్టీ అభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఎంసి వైస్ ఛైర్మన్ లింగిశెట్టి శశికుమార్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్లు కోమర్తి వేణుగోపాలరావు, మారం అను, బౌరోతు బాలాజీ, విప్ గూడవల్లి వాసు, ఎంపిటిసిలు పైడి వెంకట్రావు, మాకాల రమేష్, టిడిపి నాయకులు పాలడుగు మురళీశ్యామ్, గుండు శివాజీ, మాగంటి ప్రభాకర్, మల్లిపూడి రాజు, కెంగం లక్ష్మణరావు బ్రదర్స్, ఎలిశెట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మానసిక వికలాంగుల కేంద్రంలోని చిన్నారులకు పండ్లు, రొట్టెలు, ఆహారాన్ని అందజేశారు.