పశ్చిమగోదావరి

గృహనిర్మాణాల ప్రగతిలో అలసత్వం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 19: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహనిర్మాణాల ప్రగతిలో ఆలసత్వం వహిస్తే ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని రాష్ట్ర గృహనిర్మాణసంస్ధ జనరల్ మేనేజరు వైయు భాస్కరరావు వర్క్ ఇన్‌స్పెక్టర్లను హెచ్చరించారు. లబ్దిదారులను అవగాహన పర్చి త్వరితగతిన గృహాల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని కొంతమంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లు విస్మరిస్తున్నారని, ఇదే విధానం కొనసాగితే అటువంటివారిని తొలగిస్తామన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని గృహనిర్మాణసంస్ధ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎఇలు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ప్రత్యేకశ్రద్ద తీసుకుని పనులు ముందుకు సాగేలా చూడాలన్నారు. ఆవుట్‌సోర్సింగ్ సిబ్బంది పనితీరును ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారని, పనిలో బాగా వెనుకబడిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంతవరకు 14351 గృహాలను పూర్తి చేయటం జరిగిందని, మిగిలిన 39187 గృహాలను డిసెంబర్‌నాటికి పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. మండలానికి నెలకు 150 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా 50శాతం కూడా లక్ష్యాలను సాధించకపోవటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హౌసింగ్‌పైనే ఎక్కువుగా అధికారులు దృష్టి పెడుతున్నారని, ప్రధానమంత్రి అవాస్‌యోజన పధకంపై కూడా శ్రద్ద పెట్టాలన్నారు. గృహనిర్మాణసంస్ధ ఎస్‌ఇ పి శ్రీరాములు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువమంది లబ్దిదారులకు గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గృహాలు వెంటనే పూర్తి చేసి నివేదిక త్వరగా పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేశంలో గృహనిర్మాణసంస్ధ పిడి ఇ శ్రీనివాసులు, ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు మేనేజరు శ్రీకాంత్, డిఇలు, ఎఇలు, వర్క్‌ఇన్‌స్ప్టెర్లు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి క్షేత్రంలో బృహత్ కార్యం
* రాత్రివేళ అన్నప్రసాదం పంపిణీ ప్రారంభం
ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ఏ ప్రధాన ఆలయంలో లేని విధంగా ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు రాత్రి వేళల్లో సైతం అన్న ప్రసాదం అందించే బృహత్ కార్యాన్ని బుధవారం రాత్రి ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు ప్రారంభించారు. ముందుగా వకుళమాత నిత్యాన్నదాన భవనంలో కొలువైన స్వామివారి ద్విమూర్తులకు ఈవో పెద్దిరాజు పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ పూజాదికాలు జరిపి అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం మినహా ప్రతిరోజు రాత్రి వేళ ఏడున్నర గంటల నుండి అన్న ప్రసాద భవనంలో కదంబం, పెరుగన్నం, చట్నీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. అయితే శనివారం రాత్రి భక్తులకు అల్పాహారం అందిస్తామన్నారు. చిన వెంకన్న క్షేత్రంలో ఆగస్టు 1987లో నిత్యాన్నదానాన్ని ప్రారంభించామని, అలాగే ఏప్రిల్ 2014 నుండి శుక్రవారం రాత్రి పాదయాత్ర భక్తులకు భోజనాలు ప్రారంభించామన్నారు. నిత్యాన్నదానానికి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 1.7 లక్షల మంది దాతల సహకారంతో 38.29 కోట్ల రూపాయలు సమకూరినట్టు పేర్కొన్నారు. అన్నదానం ద్వారా దేవస్థానం కళాశాలలకు, హైస్కూలుకు, విర్డ్ ఆసుపత్రికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ వైకుంఠరావు, శ్రీనివాసరాజు, ఏఈవోలు కర్రా శ్రీనివాసరావు, ఎం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

వినాయకుని పల్లకీకి బోరుూలుగా మహిళాభక్తులు
మొగల్తూరు, సెప్టెంబర్ 19: వినాయకుని నిమజ్జనోత్సవంలో మహిళా భక్తులు బోరుూలుగా మారి పల్లకీని మోయడం పలువురిని ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే... మొగల్తూరు మండలం కె.పి.పాలెం అందేవారిమెరకలో వినాయక చవితి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ప్రతియేటా నిర్వహించే ఇక్కడి ఉత్సవాల్లో మహిళాభక్తులే చురుగ్గా పాల్గొంటారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం వినాయకుని విగ్రహాన్ని ఊరేగించారు. ఈ ఊరేగింపులో వినాయకుని విగ్రహాన్ని పల్లకీలో వుంచి ఎప్పటిలాగే మహిళాభక్తులే బోరుూలుగా వ్యవహరించి స్వయంగా గ్రామమంతా ఊరేగించారు. అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.