పశ్చిమగోదావరి

నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, సెప్టెంబర్ 19: పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇళ్లు, భూములు పోగొట్టుకున్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ కొండరెడ్ల సంఘం, ఎపిడివైఎఫ్, ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కోట రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు మాట్లాడుతూ భారత పార్లమెంటు ఆదివాసీలకు ఇచ్చిన గ్రామసభల అధికారాన్ని గౌరవించకుండా, నిర్వాసితులైన ఆదివాసీలకు భూముల సేకరణ, గృహాల నిర్మాణంలో గ్రామసభల తీర్మానాలను పాటించకుండా అధికారులు, రాజకీయ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సురక్షిత ప్రాంతాల్లో నిర్మించవలసిన గృహాలను చెరువుల కింది ఊట నేలల్లో నిర్మిస్తున్నారని తెలిపారు. ఇటువంటి నిర్మాణాల వలన ఒకసారి నిర్వాసితులైన వారిని తిరిగి మరోసారి నిర్వాసితులను చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వాసిత కుటుంబాలకు రెండున్నర ఎకరాల సాగుభూమి ఇవ్వాలను, దీనికోసం వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను సేకరించి ఇస్తున్నారని, అందుకు ఉదాహరణగా సర్వే నెం. 404 భూమిని ఉదహరించారు. ఎపిడివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నడపల సోమరాజు మాట్లాడుతూ నిర్వాసితులు పూర్వం నుండి ఎటువంటి ఆధారాలు లేకుండా సాగుచేసుకుంటున్న భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల ఆదివాసీలకు స్థానిక సర్ట్ఫికెట్లు ఇవ్వాలని, వారికి ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు, వివాహితులైన యువతులకు ప్యాకేజీ అమలుచేయాలని కోరారు. చెరువు కింది ఊట నేలల్లో ఇళ్ల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈ ధర్నాకు వివిధ సంఘాల నేతలు చోడే సీతారామయ్య, చోడే శ్రీనివాస్, చదల రాజారెడ్డి, వినె్నల గోపిరెడ్డి, పిట్ల వెంకటేశ్వరరెడ్డి, వెట్టి భద్రమ్మ, తదితరులు నాయకత్వం వహించారు.

ప్రమాదాల నివారణకు స్పీడ్ గన్‌లు
ఆకివీడు, సెప్టెంబర్ 19: త్వరలో డివిజన్ పరిధిలో ప్రమాదాల నివారణకు స్పీడ్ గన్‌లు ఏర్పాటు చేయనున్నట్టు నర్సాపురం డీఎస్పీ టి ప్రభాకర్‌బాబు చెప్పారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ఆకివీడు పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రమాదాలు తగ్గాయన్నారు. అయితే వాహన వేగం కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ముఖ్యమైన కూడళ్లలో అత్యాధునికమైన స్పీడ్ గన్‌లు (వేగాన్ని గుర్తించే కెమెరాలు) ఏర్పాటుచేయనున్నట్టు ఆయన వివరించారు. గల్ఫ్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎస్సై స్థాయి అధికారితో పాటు మహిళా పోలీస్, అంగన్‌వాడీ సిబ్బందితో కలిసి ప్రస్తుతం గల్ఫ్ బాధితులను గుర్తిస్తున్నామన్నారు. ఈ ముగ్గురితో కూడిన బృందం ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటుందన్నారు. డివిజన్ పరిధిలో కుటుంబ తగాదాలతో పాటు ఆర్థికపరమైన సమస్యలతో బాధితులు స్టేషన్‌కు వస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 250 మందిపై కేసులు నమోదుచేసి కోర్టుకు పంపగా వారికి శిక్ష విధించారన్నారు. మరోసారి మద్యం సేవించి పట్టుబడితే లైసెన్స్ రద్దుకు రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు. డివిజన్ పరిధిలో 20 పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ క్వార్టర్లు నిర్మించేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆకివీడు ఎస్సై కె సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

డిఎస్సీ 98 వారికి ఉద్యోగాలివ్వాలి
అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే నిమ్మల
పాలకొల్లు, సెప్టెంబర్ 19: డిఎస్సీ 1998లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కోరారు. 98లో ఉత్తీర్ణులైన మొదటి బ్యాచ్ నియామకాలు జరగలేదని, వారు గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఆందోళన చేస్తే ఐదుగురితో కమిషన్ వేశారని గుర్తుచేశారు. కమిషన్ వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని సిఫార్సు చేసినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వీరికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే నిమ్మల కోరారు.