పశ్చిమగోదావరి

చింతమనేనిని అరెస్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, సెప్టెంబర్ 21: ఏలూరు ఐఎంఎల్ డిపో హమాలీ మేస్ర్తి ఆర్ జాన్‌పై దాడిచేసి కులం పేరుతో దూషించిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్టుచేయాలని కోరుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్‌కు అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి జవహర్ మాట్లాడుతూ జాన్‌కు న్యాయం చేస్తానని, హమాలీ కార్మికులకు రక్షణగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం సీపీఎం అప్‌లాండ్ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌లు మాట్లాడుతూ కార్మికుల ఐక్యతను, వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా దాడులకు దిగుతున్న చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టుచేయకుంటే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిరుపేద కార్మిక వర్గ జీవనోపాధికి ఎటువంటి భంగం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ఇదే జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు కూడా ఉందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం సుందరబాబు, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం మహర్షి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర నేత ఎన్ శ్రీమన్నారాయణ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలతో దద్దరిల్లిన తాళ్లపూడి
తాళ్లపూడి, సెప్టెంబర్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తామంతా అండగా ఉంటామని, ఆయనపై కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి ఆధ్వర్యంలో ఒకవైపు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టివి రామారావు ఆధ్వర్యంలో మరోవైపు చేపట్టిన ర్యాలీలతో శుక్రవారం మండల కేంద్రమైన తాళ్లపూడి దద్దరిల్లింది. రెండు వర్గాలుగా చేపట్టిన ర్యాలీల్లో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాళ్లపూడి బస్టాండ్ నుండి మండల తెలుగుదేశం అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ ప్రక్కిలంక జగ్జీవన్‌రామ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా సుబ్బరాయ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అభివృద్ధిని ఓర్వలేకే ప్రధాని మోది అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకీ పడుతుందని హెచ్చరించారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొటారు వెంకట్రావు, మాజీ ఎంపీపీ కోట్నీస్, విల్లూరి బాబ్జి, రాపాక తిలక్, తెలుగు యువత అధ్యక్షుడు యర్రబ్బులు తదితరులు పాల్గొన్నారు. వీరి ర్యాలీ అనంతరం గజ్జరం నుండి ప్రక్కిలంక సెంటర్ వైపునకు టివి రామారావు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ చేరింది. తీన్‌మార్ వాయిద్యాలతో వచ్చిన ఈ ర్యాలీ ప్రక్కిలంక సెంటర్ నుండి తాళ్లపూడి బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోది దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కొవ్వూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ సూరపనేని చిన్ని, టివి రామారావు మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు చంద్రబాబుకు తామంతా మద్దతుగా ఉంటామని, ఖబడ్దార్ మోది అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొవ్వూరు జడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, చాగల్లు మాజీ ఎఎంసీ ఛైర్మన్ ఆళ్ల హరిబాబు, అన్నదేవరపేట ఉప సర్పంచ్ కూచిపూడి గణపతి, ఎంపీటీసీ కృష్ణమోహన్, వైస్-ఎంపీపీ ప్రభాకరరాజు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కెవికె రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలతో తాళ్లపూడి మండలంలోని మెయిన్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగగా ఎస్‌ఐ దాసు ఆధ్వర్యంలో క్రమబద్ధీకరించారు.