పశ్చిమగోదావరి

శ్రీవారి భక్తులకు సౌకర్యాల కల్పనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 21: చిన్నతిరుపతిగా ఖ్యాతిగాంచిన ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలనూ కల్పించే ధ్యేయంతో పనిచేస్తున్నట్టు శ్రీవారి దేవస్థానం ఛైర్మన్ రాజా ఎస్‌వి సుధాకరరావు అన్నారు. ఉద్వారకాతిరుమల ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.20 లక్షలతో భక్తుల సౌకర్యార్థం అధునాతనంగా నిర్మించిన క్యూకాంప్లెక్స్‌లను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అలాగే లక్ష్మీపురం ఆలయ ప్రాంగణంలో నక్షత్ర వనాన్ని, అదేవిధంగా శివాలయం వద్ద నవగ్రహ వనాన్ని ఛైర్మన్ సుధాకరరావు, ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజుతో కలిపి ప్రారంభించారు. ఈక్రమంలోనే ఆలయ అనివేటి మండపం వద్ద ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని భక్తుల సౌకర్యార్థం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ సుధాకరరావు మాట్లాడుతూ శ్రీవారిని భక్తులు సులభంగా దర్శించుకునే విధంగా ఈ క్యూకాంప్లెక్స్‌లను అధునాతన సౌకర్యాలతో నిర్మించినట్టు పేర్కొన్నారు. దాదాపు 2 వేల మంది క్యూకాంప్లెక్స్‌లోని విభాగాల్లో కూర్చుని వెళ్లే విధంగా వీటిని నిర్మించామని, అలాగే ఫ్యాన్లు, స్నాక్స్ వంటి ఇతర సౌకర్యాలను ఇందులో కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వైకుంఠరావు, శ్రీనివాసరాజు, టి సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.