పశ్చిమగోదావరి

రాష్ట్ర క్రికెట్ జట్టుకు కె ఎస్ ఎన్ రాజు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 21 : అండర్-16 బాలుర ఆంధ్రా రాష్ట్ర జట్టుకు జిల్లా నుంచి కె ఎస్ ఎన్ రాజు ఎంపికైనట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు. కృష్ణాజిల్లా మూలపాడులో జరిగిన బాలుర అండర్ -16 స్టేట్ ప్రోబబుల్స్ మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లో అద్బుతమైన ప్రదర్శన కనపర్చిన జిల్లాలోని శృంగవృక్షానికి చెందిన కె ఎస్ ఎన్ రాజు మరోసారి రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. రాజు గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో కడప, విజయనగరంలో శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా రాజును గోకరాజు రామరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎం వగేష్‌కుమార్, కోశాధికారి ప్రసాద్, కార్యవర్గ సభ్యులు అభినందించారు.
రేంజ్ పరిధిలో 12 మంది సి ఐలకు బదిలీ
ఏలూరు, సెప్టెంబర్ 21 : ఏలూరు రేంజ్ పరిధిలో 12 మంది సి ఐలను బదిలీ చేస్తూ రేంజ్ డి ఐజి టి రవికుమార్ మూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులోని స్పెషల్ బ్రాంచ్‌లో సి ఐగా పనిచేస్తున్న ఎస్‌సిహెచ్ కొండలరావును పాలకొల్లు రూరల్ సి ఐగా బదిలీ చేశారు. అక్కడ సి ఐగా పనిచేస్తున్న కె రజనీకుమార్‌ను వి ఆర్‌లో వుంచారు. నర్సాపురం రూరల్ సి ఐ ఎం సుబ్బారావును ఏలూరులోని జిల్లా స్పెషల్ బ్రాంచ్ సి ఐగా బదిలీ చేశారు. భీమవరం సిసి ఎస్ సి ఐ కె విజయబాబును కొవ్వూరు టౌన్ సి ఐగా బదిలీ చేశారు. కొవ్వూరు టౌన్ సి ఐ ఎస్‌బివి శుభాకర్‌ను వి ఆర్‌కు బదిలీ చేశారు. వి ఆర్‌లో వున్న కె సతీష్‌ను కృష్ణాజిల్లా నందిగామ రూరల్ సి ఐగా బదిలీ చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ సి ఐ ఎస్‌వివి ఎస్ మూర్తిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్ లా అండ్ ఆర్డర్ సి ఐగా బదిలీ చేశారు. అక్కడ సి ఐగా పనిచేస్తున్న ఎం రవీంద్రను వి ఆర్‌లో వుంచారు. వి ఆర్‌లో వున్న సిహెచ్ సూరిబాబును కృష్ణాజిల్లా మైలవరం రూరల్ సి ఐగా నియమించారు. అక్కడ సి ఐగా వున్న పి రామచంద్రరావును వి ఆర్‌లో ఉంచారు. వి ఆర్‌లో వున్న ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్‌ను కృష్ణాజిల్లా తిరువూరు సి ఐగా బదిలీ చేశారు. అక్కడ సి ఐగా వున్న కె వివి ఎన్ సత్యనారాయణను వి ఆర్‌లో ఉంచారు.