పశ్చిమగోదావరి

భక్త్భివం పెంచుతున్న ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగల్లు, సెప్టెంబర్ 21: ఉత్సవాలు ప్రజల్లో భక్త్భివం పెంచి యువతను సన్మార్గం వైపు నడిపిస్తున్నాయని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. తెలగా సంఘం ఆధ్వర్యంలో 62 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ కళాకారును ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. శుక్రవారం రాత్రి మంత్రి గణపతి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ పెద్దలు గండ్రోతు సురేంద్ర, జుట్టా కొండలరావు, దాసరి కృష్ణ , పిండి మంగారాజు ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరుటూరి సతీష్, కోడూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చాగల్లు మండల మదర్ థెరిస్సా సేవాసమితి నిర్వాహకులు పోలిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. అనంతరం ఊనగట్లలో కాపుల వినాయక నవరాత్రి ఉత్సవలను సందర్శించారు. ఉత్సవ కమిటీ మంత్రి జవహర్‌ను ఘనంగా సత్కరించింది.
ఉర్రూతలూగించిన ఆర్కెస్ట్రా
చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర కళావేదికపై శుక్రవారం రాత్రి విశాఖపట్టణానికి చెందిన రోషన్ లాల్ ఆర్కెస్ట్రా నిర్వహించిన ప్రదర్శన ఆహుతులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా రోషన్‌లాల్ ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ ఎస్ రాము మాట్లాడుతూ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పటివరకు మూడువేల ప్రదర్శనలిచ్చినట్టు చెప్పారు. 1990లో రోషన్‌లాల్ ఆరెస్ట్రా స్థాపించారని, ఆయన మృతి తరువాత ఆయన కుమారుడు కపూర్ ఆధ్వర్యంలో సంస్థ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తాము బాలసుబ్రహ్మణ్యం, ఎల్‌ఆర్ ఈశ్వరీ, జానకి వంటి సుప్రసిద్ధ గాయకులతో కలిసి చేయటం గర్వంగా ఉందన్నారు. తొలుత విశాఖకు పరిమితమైన ఆర్కెస్ట్రా చాగల్లు తెలగా సంఘం వేదిక సహకారంతో గుర్తింపు పొందామన్నారు. వివి వినాయక్ కుటంబ సభ్యులు తమకు ఎంతో చేయూతనిచ్చారన్నారు.

24న జనసేనాని రాక
నెలాఖరు వరకు పర్యటన
ఏలూరు కేంద్రంగానే షెడ్యూలు
కీలకనిర్ణయాలు ప్రకటించే అవకాశం

ఏలూరు, సెప్టెంబర్ 21 : జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా పోరాట యాత్ర మలివిడత కార్యక్రమం జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. దీని నిమిత్తం ఈ నెల 24న పవన్ కళ్యాణ్ జిల్లా కేంద్రమైన ఏలూరుకు చేరుకోనున్నారు. ఆ తర్వాత నెలాఖరు వరకు ఏలూరు కేంద్రంగా ఆయన పలు నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన కోసం ఆయన అభిమానులతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన భీమవరం కేంద్రంగా డెల్టా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత ఏలూరు చేరుకుని వివిధ నియోజకవర్గాల్లో ఆయన ప్రజాపోరాట యాత్ర కార్యక్రమం ముందుకు వెళుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించారు. అయితే అనూహ్యంగా పవన్‌కళ్యాణ్ భీమవరం నుంచి వెళ్లి రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా మారిపోయారు. అనంతరం ఆయన కంటి చికిత్స చేయించుకోవడంతో జిల్లా పర్యటన మరోసారి వాయిదా పడింది. దీంతో ఎప్పటికప్పుడు జిల్లాలో మలి విడత ప్రజా పోరాట యాత్ర కార్యక్రమంలో స్పష్టత లేక పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అయోమయంలో ఉండిపోయారు. ఇలాంటి నేపధ్యంలో తాజాగా పవన్‌కళ్యాణ్ పశ్చిమలో మలివిడత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. దీనిలో ఈ నెల 24వ తేదీ రాత్రికి పవన్‌కళ్యాణ్ ఏలూరు చేరుకోనున్నారు. ఆ తరువాత 25 నుంచి ఏలూరు కేంద్రంగానే ఆయన పర్యటన షెడ్యూలు ముందుకు వెళుతుందని చెపుతున్నారు. ఇక్కడ నుంచే దాదాపుగా ఆయన ఏడు నియోజకవర్గాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహిచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చింతలపూడి, దెందులూరు, పోలవరం, గోపాలపురం, ఉంగుటూరు, కొవ్వూరు, ఏలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ తన ప్రజాపోరాట యాత్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళతారు. పగటి పూట ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి తిరిగి సాయంత్రానికి ఏలూరు చేరుకుంటారని తెలుస్తోంది. 25వ తేదీన ఏలూరులో ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఆయన పర్యటన వుంటుందని భావిస్తున్నారు. పోణంగిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిశీలన వంటి కార్యక్రమాలను ఆయన ఆరోజు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే రోజు సాయంత్రం ఏలూరులోని పాతబస్టాండ్ సెంటర్‌లోగానీ, ఫైర్‌స్టేషన్ సెంటర్‌లోగానీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఇక 26వ తేదీ నుంచి ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు, పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహించుకునేందుకు స్థానిక తంగెళ్లమూడి ప్రాంతంలో ఒక వేదికను ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ విధంగా ఆయన ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి సాయంత్రానికి ఇక్కడకు చేరుకుని సమాలోచనలు జరుపుతారని తెలుస్తోంది. మరోవైపు ఈ సందర్భంగానే ఆయన పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించే అవకాశం వున్నట్లు చెబుతున్నారు. ప్రాజెక్టు కేంద్రంగా పలు వివాదాలు ముసురుతున్న నేపధ్యంలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్న తరుణంలో స్వయంగా ప్రాజెక్టులు సందర్శించి అక్కడి పరిస్థితిని అంచనా వేసి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. కాగా ఏలూరు కేంద్రంగా రూపుదిద్దుకున్న పవన్ పర్యటన షెడ్యూలులో భాగంగా ఆయన వివిధ వర్గాలతో ఇక్కడ సమావేశమవుతారని తెలుస్తోంది. విద్యార్దులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారితో సమాలోచనలుజరిపి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తన అభిప్రాయాలను వారితో పంచుకుంటారని తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేన పార్టీ పరంగా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ పరిస్థితి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరు తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద వారం నుంచి 10 రోజులపాటు జిల్లా పర్యటన కొనసాగించి అనంతరం కొవ్వూరు మీదుగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళతారని భావిస్తున్నారు.

ఆయిల్‌పామ్ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
ఎపి రైతు సంఘం డిమాండ్
ఏలూరు, సెప్టెంబర్ 21 : ఆయిల్‌పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ఒక శాతం ఆయిల్ రికవరీ పరిహారం ఇవ్వకుండా మోసగిస్తోందని ఎపి రైతు సంఘం అప్‌లాండ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పవర్‌పేటలోని అనే్నభవనంలో ఆయిల్‌పామ్ రైతుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాలో ఆయిల్‌పామ్‌కు రికవరీ శాతం 16.4 శాతం నిర్ణయించగా తెలంగాణాలో 18.4 శాతంగా నిర్ణయించి అక్కడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందని చెప్పారు. దీని ఫలితంగానే టన్ను గెలలకు వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయల వరకు తెలంగాణ రైతులకంటే ఆంధ్రా రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతుల ఆందోళన ఫలితంగా గెలలు వెయ్యి టన్నులు, తెలంగాణాలోని ఆయిల్‌పామ్ కర్మాగారంలో మిల్లింగ్ చేయగా 18.55 శాతం రికవరీ వచ్చిందన్నారు. ఈ రికవరీ ఆధారంగా ధర నిర్ణయించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక శాతం, ప్రైవేటు కంపెనీలు 0.5 శాతం అందించి ధర నిర్ణయించాలని, ఇంత వరకు ప్రభుత్వం 0.5 శాతం ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. రికవరీ శాతం పరిహారం వెంటనే రైతులకు చెల్లించాలని కోరారు.

కార్యచరణ ప్రకటించకుంటే పోరుబాట
రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు
తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 21: నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలుకు వెంటనే కార్యాచరణ ప్రకటించాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అల్టిమెటం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015 ఆగస్టు 20న నిట్ శంకుస్థాపన సమయంలో సీఎం చంద్రబాబు అధికారికంగా ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. వాటి అమలుకు అనేకసార్లు విజ్ఞప్తి చేశానని, సీఎం సానుకూలంగా స్పందించినా స్థానికంగా ఉన్న నేతల కారణంగా అమలు చేయలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేలేదంటూ ధర్మపోరాట దీక్షలు చేపట్టడం కేవలం రాజకీయ ప్రచారం, పార్టీ ప్రయోజనం కోసమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పలు సంస్థలను రాష్ట్రానికి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జల్లాకు ఏమీ ఇవ్వలేదన్నారు. ఈనెల 29న జరగనున్న సభలో గూడెం హామీలు అమలుకు కార్యాచరణ సిద్ధం చేసి ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ పోరుబాట పడుతుందన్నారు. విమానాశ్రయ భూముల్లో నివాసం ఉండే వారికి ఇళ్ళపట్టాలు ఇచ్చేందుకు వీలుగా జివో 118ని ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై ఈ భూములను క్రమబద్దీకరించడం కుదరదంటూ సంక్షిప్త సందేశాలు పంపడం దారుణమన్నారు. ఇదే విషయాన్ని అసెంబీల్లో ప్రస్తావించానని, దీనిపై విచారణ జరిపిస్తానని రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి హామీ ఇచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానని ఆయన హామీ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పోతుల అన్నవరం, బీజేపీ పట్టణాధ్యక్షులు కర్రి ప్రభాకర బాలాజీ, యువమోర్చా అధ్యక్షులు యడ్లపల్లి శ్రీరామ్, గిరీష్, మహిళా మోర్చా నేతలు ధనలక్ష్మీరెడ్డి, శ్రీదేవి, ముదునూరి రామసీత, రంగారావు, అడపా రమేష్ తదితరులు పాల్గొన్నారు.