పశ్చిమగోదావరి

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 22: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో రూ.4.50 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్భ్రావృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. వౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా ఉన్నామన్నారు. ప్రతీ పేదవానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. డిసెంబరు నెలలో రెండు వాయిదాలుగా రుణమాఫీ చేపడతామన్నారు. రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పారదర్శకంగా రేషన్ అందిస్తున్నామన్నారు. క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండుగలకు ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తున్నామన్నారు. రైతు రథం పథకంలో రాష్ట్రంలో పదివేల మందికి ట్రాక్టర్లు సబ్సిడీపై ఇస్తామన్నారు. డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన విధంగా సాధికార మిత్రలకు కూడా గుర్తింపు ఇస్తామన్నారు. పోలవరం, అమరావతి అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు ఈర్ష్య పడుతున్నాయన్నారు. అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబును ప్రతీ ఒక్కరూ కోరుకోవాలన్నారు. కొమ్ముగూడెంలో మరో పీహెచ్‌సీ, జూనియర్ కళాశాల ఏర్పాటు విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ గృహనిర్మాణ పథకం బకాయిలు రెండు, మూడు మాసాల్లో మంజూరు చేస్తామన్నారు. ఎర్ర కాలువ ముంపు నుంచి గ్రామాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు కృషిచేస్తామన్నారు. భూసేకరణ ప్రక్రియలో రైతులు సహకరించాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పునర్ వ్యవస్థీకరణ చేసి ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్‌కు ఆదేశాలు ఇస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందన్నారు. మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రతీ ఇంటికి గ్యాస్ అందిస్తామన్నారు. మండలంలో సొంత భవనాలు లేని పంచాయతీలకు పంచాయతీ భవనాలు కట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ ముత్యాల రత్నం, ఎంపీపీ గన్నమని దొరబాబు, పెంటపాడు ఎంపీపీ పెదపోలు వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, వైస్‌చైర్మన్ కిలాడి ప్రసాద్, పశుసంవర్థక శాఖ చైర్మన్ పాకలపాటి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

పంట తరలింపు అడ్డుకున్న గిరిజనులు
జీలుగుమిల్లి, సెప్టెంబర్ 22: పోలవరం నిర్వాసితుల గృహనిర్మాణం కోసం సేకరించిన భూముల్లో తాము సాగుచేసిన పత్తిపంటను తరలించాలని ప్రయత్నించిన రెవెన్యూ, పోలీసు అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. సంఘటన వివరాల్లోకి వెళితే నిర్వాసితుల గృహనిర్మాణ భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా సాగుచేసిన పత్తిపంటను తొలగించాలని శనివారం ఉదయం అధికారులు జేసీబీతో సహా తరలివచ్చారు. దీంతో గిరిజనులు అధికారుల ప్రయత్నాలను అడ్డుకుని, జేసీబీని వెనుకకు పంపిచివేశారు. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పి.నారాయణపురం రెవెన్యూ పరిధిలోని సర్వేనెం. 214, 215, 216లలో 26.34 ఎకరాల భూమిని అధికారులు నిర్వాసితుల గృహనిర్మాణం కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో సేకరించారు. స్థానిక గిరిజనులు ఆ భూములు తమకు చెందినవని, ఆ భూముల్లో పత్తిసాగుకు ఉపక్రమించి, పంటను వేశారు. కాగా అధికారులు నిర్వాసితుల గృహనిర్మాణం పనులను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో శనివారం పత్తిపంటను తొలగించడానికి యత్నించగా, గిరిజనుల నుండి ప్రతిఘటన ఎదురైంది. గిరిజనులకు ఆ భూములపై అధికారం ఉంటే భూసేకరణ అధికారైన ఐటీడీఏ పీవో, న్యాయస్థానాల ద్వారా అనుమతులు తెచ్చుకోవాలని, అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ, ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోకూడదని లన్నారు. గిరిజనులు మాట్లాడుతూ సదరు రెవెన్యూ పరిధిలోని 300 ఎకరాల్లో స్థానిక గిరిజనులు 1/70 చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్నామని తెలిపారు. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు తమకు పట్టాలు కూడా ఇచ్చారని, కానీ ప్రస్తుతం అధికారులు ఇవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వివాదాస్పద భూములు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఎలా సేకరించారని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగేవరకు భూముల నుండి వైదొలిగేది లేదని స్పష్టంచేశారు.