పశ్చిమగోదావరి

బియ్యం పక్కదారి పడితే పిడి కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 22 : రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై పిడి యాక్ట్ కింద కేసులునమోదుచేస్తామని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సాయంత్రం జరిగిన జిల్లా ఆహార సలహా నిఘా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జి రఘురామ్ మాట్లాడుతూ జిల్లాలో రేషన్ బియ్యాన్ని మిల్లర్లు అక్రమంగా కొనుగోలుచేసి దానికి పాలిష్‌పెట్టి వివిధ బ్రాండ్ల పేరుతో పి ఎల్ బియ్యంగా విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. రేషన్‌షాపుల్లో పంపిణి చేసే స్వర్ణ, 1061 రకం బియ్యాన్ని కొనుగోలు చేసి దానికి స్కిల్ పాలీష్ చేసి బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారన్నారు. ముఖ్యంగా ఈ వ్యాపారం ఏలూరు వన్‌టౌన్‌లోని పలు బియ్యం దుకాణాల్లో జోరుగా సాగుతోందని చెప్పారు. దెందులూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ టన్నులకొద్ది రేషన్ బియ్యాన్ని సేకరించి రైస్‌మిల్లులకు అమ్ముతూ కోట్ల రూపాయలు ఆర్జించాడని చెప్పారు. ఇదే అంశంపై కమిటీలోని మిగిలిన సభ్యులుకూడా ఫిర్యాదు చేయడంతో సమావేశం అయిన వెంటనే డి ఎస్‌వోతోపాటు ఎ ఎస్‌వోలు సంబంధిత షాపులపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, దుర్వినియోగంపై ఇటీవల పలు కేసులు నమోదుచేయడం జరిగిందన్నారు. ఇటీవల నర్సాపురంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారని తనకు ఫోన్ ద్వారాసమాచారం అందగానే అధికారులను అప్రమత్తం చేసి 35 బస్తాల బియ్యాన్ని సీజ్ చేయడంతోపాటు ఆ వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని, ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని, ఎక్కడైనా మట్టి బెడ్డలతో కూడిన బియ్యం పంపిణీ చేస్తే వెంటనే దాన్ని పౌర సరఫరాల సంస్థకు పంపి నాణ్యమైన బియ్యాన్ని తీసుకుని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా షాపులకు వెళ్లలేని వారికి వారి ఇంటి వద్దే రేషన్ సరుకులు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో రెండు వేల మందికి వేలిముద్రలు సరిపోలేదని, వీరిలో 1600 మందికి రేషన్ సరుకులను వి ఆర్‌వోల ధృవీకరణతో అందించడం జరిగిందని, మిగిలిన వారికి కూడా అందించేందుకుచర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రజల ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, కల్తీలు, తూకాల్లో మోసాలు జరగకుండా నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ప్రతీ మనిషి కష్టపడి సంపాదించే తత్వాన్ని అలవర్చుకోవాలని, అలా కాకుండా దురాశతో కల్తీలు, అక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన శిక్షలకు గురికావాల్సి వుంటుందని హెచ్చరించారు. కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ చింతలపూడిలోని మారుతీనగర్, నందమూరి విజయ నగర్, ఆంథోని నగర్‌లో 700 మంది కుటుంబాలు వున్నాయని, వారికి ప్రత్యేకంగా రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కమిటీ సభ్యులు ఎం రాజారావు మాట్లాడుతూ రేషన్ దుకాణాల్లో ఇప్పుడు ఇస్తున్న బియ్యంతోపాటు సన్నబియ్యాన్ని కూడా సబ్సిడీపై అందించాలని సూచించారు. కమిటీ సభ్యులు ఎ ఆర్‌కె మోహనరావు మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై 6ఎ కింద అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని చెప్పారు. టింబర్ డిపోల్లో తప్పుడు కొలతల కారణంగా వినియోగదారులు నష్టపోతున్నారని, ఈ విషయంలో తూనికలు, కొలతలు శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిటీ సభ్యులు బి నాగ చంద్రారెడ్డి మాట్లాడుతూ పోర్టబులిటీ కింద ప్రజలు తమ దగ్గరలోని రేషన్ దుకాణాల్లో రేషన్ తీసుకునేందుకు కొంతమంది డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. కమిటీ సభ్యులు రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ వేలిముద్రలు సరిపోలని వారిని 10,15వ తేదీ దాటిన తరువాత రేషన్ సరుకుల నిమిత్తం రమ్మంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కమిటీ సభ్యులు నేతల రమేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని పాస్ట్ఫుడ్ సెంటర్లలో నిషేధిత సింథటిక్ రంగులను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని, విస్తృతంగా దాడులు నిర్వహించి దీన్ని అరికట్టాలని సూచించారు. కమిటీ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో పశుమాంస వ్యర్దాలతో వంట నూనెలు, కల్తీ టిపోడి తయారీలతో జిల్లా కేంద్రమైన ఏలూరు కల్తీ వస్తువుల తయారీకి అడ్డాగా మారిందని, అధికారుల నిఘా పర్యవేక్షణ కొరవడటంతో ప్రజారోగ్యానికి భంగం వాటిల్లుతోందని, కల్తీదారులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రాజులపాటి గంగాధరరావు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డి ఎస్‌వో సయ్యద్ యాసిన్, పౌర సరఫరాల సంస్థ డి ఎం కొండయ్య, డి ఇవో సివి రేణుక, ఐసిడి ఎస్ పిడి విజయకుమారి, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.