పశ్చిమగోదావరి

పకడ్బందీగా శాంతిభద్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 25 : జిల్లాలోని ప్రతీ పోలీసు ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వర్తించి పకడ్బందీగా శాంతి భద్రతలను కాపాడాలని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సర్కిల్ వారీగా ఆయన సమీక్షించారు. కేసుల నమోదు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, చార్జిషీటు దాఖలు వరకు లోతుగా సమీక్షించారు. కేసుల చేధింపునకు, నియంత్రణకు దోహదం చేసే సూచనలు, మెలకువలను ఎస్‌పి వివరించారు. అనంతరం ఎస్‌పి మాట్లాడుతూ అరకులోయలో జరిగిన మావోయిస్టు ఘాతుకంలో పాల్గొన్న మహిళా మావోయిస్టు స్వరూప కామేశ్వరి గతంలో భీమవరంలోనివాసం వున్నట్లు, వారి కుటుంబ కలహాలతో ఏవోబిలోకి మకాం మార్చినట్లుగా, వారికి సంబంధించిన వారు ఎవరూ ఇక్కడ లేరని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ముంపు మండలంలో గత చరిత్ర ఆధారంగా ఉంచుకుని గత ఆరుమాసాల నుంచి పోలవరం ముంపు మండలాల్లో, ఏరియాల్లో అణువణువూ కూంబింగ్ నిర్వహిస్తున్నామని, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతీ ఒక్కరి చిరునామాలు క్షుణ్ణంగా పరిశీలన జరుపుతున్నామన్నారు. జిల్లాలో నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్డు భద్రతకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు ఎస్‌సి, ఎస్‌టి వర్గాలపై జరిగే నేరాలకు అడ్డకట్ట వేయాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని డివిజన్ల నుంచి పోలీసులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో జరిగిన వివిధ కేసుల్లో ప్రతిభ సాధించిన పోలీసు ఉద్యోగులకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు జిల్లా ఎస్‌పి రవిప్రకాష్ అందజేశారు.

నంది నాటకోత్సవ బహుమతి ప్రదానోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
*ఇన్‌ఛార్జి కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశం
ఏలూరు, సెప్టెంబర్ 25 : ఏలూరులో ఈ నెల 30వ తేదీన జరగనున్న నంది నాటకోత్సవ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. స్థానిక క్రాంతి కల్యాణ మండపంలో 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, మొత్తం 300 మందికి బహుమతులు అందజేస్తామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌వో ఎన్ సత్యనారాయణ, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె సుభాషిణి, జడ్పీ సిఇవో నాగార్జునసాగర్, జిల్లా అదనపు ఎస్‌పి ఈశ్వరరావు, డి ఎంహెచ్‌ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, ఆర్డీవో చక్రధరరావు, కార్పొరేషన్ కమిషనర్ మోహనరావు, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు కెవి రమణారావు, ఎఫ్‌డిసి మేనేజర్ విన్నకోట శ్రీనివాసరావు, డిప్యూటీ మేనేజర్ ఎం శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.