పశ్చిమగోదావరి

దేవి మహిమ ఎంతో గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 14 : దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని, లేని శక్తి ఏర్పడుతుందని, అచిరకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమవుతాయని వేద విజ్ఞాన పరిశోధనా ప్రచార సంస్థ సంస్థాపక అధ్యక్షులు, చారిత్రక నవలా చక్రవర్తి, వేద విజ్ఞాన ఖని బిరుదాంకితులు ప్రొఫెసర్ ముదిగిండ శివప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక అగ్రహారంలోని శ్రీ రత్నకమలాంబికా పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ఆధ్యాత్మిక ప్రవచనాన్ని వివరించారు. పీఠాన్ని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక సేవలను అందించడం వలన సమాజానికి ఎంతో ఉపకారం చేసినవారు అవుతారని నిర్వాహకులను అభినందించారు. నేటి తరుణంలో ఆధ్యాత్మిక భావాలను ప్రజల్లో పెంపొందించాల్సిన బాధ్యత ఎంతైనా వుందన్నారు. సేవాకార్యక్రమాలతోపాటు ఆధ్మాత్మిక సేవకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అభివృద్ది చెందిన దేశాల్లో కూడా నేడు ఆధ్యాత్మికత ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయనే భావానికి వచ్చారన్నారు. ఏ మనిషి అయినా గానీ జీవించి వుండగానే చేసిన పుణ్యం, సేవ, ధాన ధర్మాలు కూడా చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. నేడు ప్రతీ ఒక్కరూ కూడా నిరంతరం పూజలు, నోములు, వ్రతాలు చేయడం ద్వారా వారి కుటుంబాల సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకోవచ్చునన్నారు. దేవినవరాత్రుల్లో నిరంతరం పూజలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందన్నారు. సమాజంలో ఏ ఒక్కరినీ ద్వేషించకూడదని, కులాన్ని, మతాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అందరూ సమానమనే భావన కలగాలన్నారు. ప్రపంచంలో ఎవరికీ తెలియని విషయాలు కూడా తాను ఆధారాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. జీసస్, జోసెఫ్ తదితర క్రిస్టియన్ ప్రముఖులుకూడా హిందువులేనని తెలిపారు. అందుకు సంబందించిన గ్రంధాలు, ఆధారాలు తన వద్దవున్నాయని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో గతంలో ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులు వుండేవారని, కాగా తగిన ఆధరణ లేక పిల్లలు ఇతర దేశాల్లో వుంటే పెద్దలు మాత్రం నివాసాలకే పరిమితమవుతున్నారని, చాలా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చందనశాఖి (స్మృతికావ్యం) ఒకటి, రెండు భాగాల గ్రంధాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన వెంట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పీఠాధిపతి రత్నబాల, లలితా కామేశ్వరి, తాయారు, కె కృష్ణమాచార్యులు, గురుశర్మ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.