పశ్చిమగోదావరి

రూ.3 కోట్లతో చలివేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 29: వేసవిలో దాహార్తితో ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రూ.3 కోట్లతో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. స్థానిక తాలూకాఫీసు సెంటరు, వెల్లమిల్లి స్టేజ్‌ల వద్ద విపత్తు నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు. మజ్జిగ, మంచినీటితోపాటు ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. తాడేపల్లిగూడెం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 28 వేసవి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు పాశం నాగమణి, డిటి రమణ, ఎంపిడిఒ దోశిరెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, మున్సిపల్ కౌన్సిలర్ కోట రాంబాబు, అంగిన సత్తిబాబు, కొండపల్లి నగేష్, పుసుపులేటి నాగేశ్వరరావు, పులి గోపాలకృష్ణ, నూకల బుల్లియ్య తదితరులు పాల్గొన్నారు.
పేదప్రజల ఆరోగ్య సంక్షేమమే సిఎం లక్ష్యం
పెంటపాడు: రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న సంజీవని జనరిక్ మందుల షాపును మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పైడికొండల మాట్లాడుతూ 20 శాతం తగ్గింపుపై అన్న సంజీవనిలో బయట మెడికల్ దుకాణాలలో లభించని మందులు ఇక్కడ లభిస్తాయన్నారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలు సురక్షితంగా ఇంటికి చేర్చాలనే ఉద్దేశ్యంతో తల్లీబిడ్డల వాహనాన్ని ఏర్పాటుచేశామన్నారు. పెంటపాడులో మైనార్టీ నిధుల నుండి రూ.15 లక్షలు షాదీఖానా నిర్మాణానికి మంజూరు కాగా మంత్రి మాణిక్యాలరావు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. బోడపాడు గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ తాడేపల్లి సూర్యచంద్రకుమారి, జడ్పీటీసీ కిలపర్తి వెంకట్రావు, మాజీ జడ్పీటీసీ దాసరి కృష్ణవేణి, డిసిసిబి డైరెక్టర్ దాసరి అప్పన్న, ఎంపిటిసిల ఛాంబర్ అధ్యక్షుడు దాసరి సతీష్, ఎంపిడిఒ జివికె మల్లికార్జునరావు, తహసీల్దార్ ఎ మధుసూదనరావులు పాల్గొన్నారు.