పశ్చిమగోదావరి

లారీ, ట్రావెల్స్ బస్సు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 30: మండలంలోని వేగవరం సమీపంలో హైదరాబాద్ నుండి పెద్దాపురం వెడుతున్న గోల్డెన్ ట్రావెల్ బస్సు, కాకినాడ నుండి జగ్గయ్యపేట సిరామిక్ లోడుతో వెడుతున్న లారీ శనివారం తెల్లవారుజాము ఎరురెదురుగా ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కు పోవడంతో స్థానికులు చాకచక్యంగా అతన్ని బయటకు తీయగలిగారు. గాయపడిన వారందరినీ స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారిలో రాజమండ్రికి చెందిన బస్సు డ్రైవర్ గొర్రెల దుర్గారావు, లారీ డైవర్ యరుగపల్లి శ్రీను, ప్రయాణీకులు పెద్దాపురానికి చెందిన మిలియాల హారిక (24), మిరియాల సత్య (25), కొత్తపల్లి నాగ (27), హైదరాబాద్‌కు చెందిన గుండుపోగుల అమరావతి (25), ద్రాక్షారామకు చెందిన పిల్లి రామకృష్ణ (55) ఉన్నారు. వీరిలో నాగ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతని కుటుంబ సభ్యులు రాజమండ్రి ఆసుపత్రికి తరిలించారని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కరరావు తెలిపారు. క్షతగాత్రుల నుండి వాంగ్మూలం నమోదు చేసుకుని హెడ్ కానిస్టేబుల్ పర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం
ఏలూరు, ఏప్రిల్ 30 : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యామని వైసిపి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. శనివారం రాత్రి వైసిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 2వ తేదీన జిల్లాలోని అన్ని మండల కేంద్రాల వద్ద ఖాళీ బిందెలతో ప్రదర్శనలు, తాగునీరు, సాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఇటీవల ప్రభుత్వం పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ పన్నులు పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్కటీ కూడా అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని, జాబు రావాలంటే బాబు రావాలంటూ ప్రచారం చేశారని అన్నారు. ప్రజలను నిర్లక్ష్యంగా చూస్తోందన్నారు. ప్యాకేజీల పేరుతో కూడా ప్రజలకు అన్యాయమే చేస్తోందన్నారు. మే 5వ తేదీన జగన్ పశ్చిమగోదావరి జిల్లాలోని విలీన మండలాలైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటారన్నారు. 6వ తేదీన తూర్పుగోదావరిలో విలీనమైన నాలుగు మండలాల్లో సమస్యలపై కూడా అధ్యయనం చేస్తారన్నారు. ఆయన వెంట వైసిపి మహిళా నాయకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వైసిపి నాయకులు తెల్లం బాలరాజు, వాసు రావు, ఘంటా మురళీ రామకృష్ణ, కొఠారు రామచంద్రరావు, వెంకట్రావు తదితరులున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవలో భాగస్వాములవ్వాలి
నరసాపురం, ఏప్రిల్ 30: ప్రభుత్వ ఉద్యోగులు కూడ ప్రజాసేవలో భాగస్వాములు కావాలని జిల్లా అదనపున్యాయమూర్తి పి కళ్యాణరావు కోరారు. శనివారం స్థానిక హైవే ఇన్ కల్యాణమండపంలో నరసాపురం మండల న్యాయసేవాధికార సంస్థ, లయన్స్ క్లబ్, ఐఎంఎ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో న్యాయమూర్తి కల్యాణరావు మాట్లాడారు. అనంతరం న్యాయమూర్తి రక్తదానం చేశారు. వైద్యశిబిరంలో 533 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 250 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో నరసాపురం సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె రత్నప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి శైలజ, అడిషనల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్ వరలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ కెకె జాన్, వైద్యులు మురళి, రామసతీష్, నాయకర్, మూర్తి, పద్మావతి, కోటేశ్వరరావు, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు పాల్గొన్నారు.

ఎపిఇర్‌సి ఛైర్మన్ జస్టిస్ గ్రంధికి
ఎమ్మెల్యే బండారు అభినంధన
నరసాపురం, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) ఛైర్మన్‌గా జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్ రెండోసారి పదవి చేపట్టడం పట్ల నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు హర్షం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో జస్టిస్ భవానీప్రసాద్‌ను ఎమ్మెల్యే మాధవనాయుడు కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. విద్యుత్ శాఖలో మరిన్ని సంస్కరణలు చేపట్టి సామాన్యులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేవిధంగా భవానీప్రసాద్ కృషిచేయాలని ఆకాంక్షించా