పశ్చిమగోదావరి

సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, నవంబర్ 13: ప్రతి పేదవానికి సొంతిల్లు ఉండాలని, ప్రతి మహిళ తన కుటుంబంతో ఆనందంగా ఉండాలనే ధ్యేయంతో సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని పేదలకు గృహాలు నిర్మించాలనే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఈ గృహాలను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరునాటికి పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం మంత్రి నారాయణ కొవ్వూరు పట్టణానికి విచ్చేశారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాలలో పేదవారికి 9.5 లక్షల గృహాలను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నామన్నారు. ఆయా గృహాలలో మెరుగైన వసతులు కూడా కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.750 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ నిధుల్లో కొవ్వూరు పురపాలక సంఘానికి రూ.14 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. అమృత పథకం ద్వారా రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాలకు మంచినీటి వసతి కోసం రూ.457 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కొవ్వూరు పురపాలక సంఘానికి మంచినీటి సదుపాయం కోసం రూ.49.56 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలలో రహదారులు, డ్రెయినేజీల అభివృద్ధికి రూ.12500 కోట్లు వ్యయమవుతుందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా ఈ పనులకు తొలి విడతగా రూ.600 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. త్వరలో టెండర్లు కూడా పిలవనున్నట్టు చెప్పారు. రాష్ట్రం నిధుల కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్నా క్యాంటిన్లకు అనూహ్యమైన స్పందన లభిస్తోందని, త్వరలో గ్రామీణ ప్రాంతాలలో మరో 152 అన్నా క్యాంటిన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. కొవ్వూరు పట్టణం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని, పట్టణాభివృద్ధికి తన సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తుంటే కొంతమంది వ్యక్తులు సహించలేక లేనిపోని అపవాదులు వేస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ కొవ్వూరు పట్టణాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని మంత్రి నారాయణను కోరారు. రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ కొవ్వూరు పురపాలక సంఘం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు. కొవ్వూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో కొవ్వూరు పట్టణం ఇంత అభివృద్ధి సాధించలేదన్నారు. టీడీపీ హయాంలోనే పట్టణాభివృద్ధి సాధ్యమైందన్నారు. అనంతరం మంత్రి నారాయణ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అఢ్మినిస్ట్రేషన్ కె కన్నబాబు, మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్రకుమార్, అవంతీ ఫీడ్స్ ఛైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ డి రాజారమేష్, ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, టీడీపీ నాయకులు జెవిఎస్ చౌదరి, పి శ్రీనివాస్‌తోపాటు కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.