పశ్చిమగోదావరి

స్కానింగ్ కోసం గర్భిణుల పడిగాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీలుగుమిల్లి, నవంబర్ 13: గర్భ నిర్ధారణ జరిగినప్పటి నుండి కాన్పు జరిగేంత వరకు గర్భిణులకు వారి పరిధిలోని పీహెచ్‌సీల్లో ప్రతినెలా స్కానింగ్ నిర్వహించి, ఆ నివేదిక ప్రకారం వైద్యులు చికిత్స, సలహాలు ఇస్తుంటారు. దానిలో భాగంగా జీలుగుమిల్లి పీహెచ్‌సీ పరిధిలోని 27 మంది గర్భిణులను అనివార్య కారణాల వల్ల 9వ తేదీన కాకుండా 13వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. కాని మధ్యాహ్నం ఒంటి గంట దాటినా స్కానింగ్ సిబ్బంది రాకపోవడంతో గర్భిణులు ఆసుపత్రి వద్దనే పడిగాపులు పడాల్సి వచ్చింది. సమయం ప్రకారం ఆహారం, తగిన విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండవలసిన గర్భిణులు కనీసం ఎంగిలిపడటానికి కూడా ఏమీలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్కానింగ్ సిబ్బంది అదిగో పది నిముషాల్లో, ఇదిగో పది నిముషాల్లో వస్తున్నారంటూ నాలుగుగంటల పాటు మభ్యపెట్టారని వాపోయారు. ఆసుపత్రిలో మరుగుదొడ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండటంతో తీవ్ర ఇక్కట్లకు గురయ్యామని మహిళలు తెలిపారు. ఆరోగ్య పరీక్షల అనంతరం త్వరగా ఇంటికి వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో వెంట ఎవరినీ తెచ్చుకోలేదని, గంటల తరబడి కూర్చోవడంతో ఏమైనా అత్యవసరమై, ప్రాణాల మీదకు వస్తే ఎవరు బాధ్యులని గర్భిణులు వాపోతున్నారు. ఇకపై కచ్చితమైన సమాచారంతోనే తమను ఆసుపత్రికి తీసుకురావాలని కోరుతున్నారు. సంఘటనపై డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ పరికరాలు, సిబ్బంది లేకపోవడంతో అర్హత కలిగిన ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు బాధ్యతలు అప్పగించామని, అందువల్ల అసౌకర్యం కలిగినట్లు వివరించారు. స్కానింగ్ కోర్సులో శిక్షణ కోసం ప్రభుత్వ వైద్యులను పంపించామని, వారు రాగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారితోనే స్కానింగ్‌లు చేయిస్తామని తెలిపారు.
పోలీసు ఉద్యోగాలు కేటాయంచాలని ఆందోళన
ఏలూరు, నవంబర్ 13 : ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు ఉద్యోగుల నోటిఫికేషన్‌లో జిల్లాకు ఎటువంటి కేటాయింపు జరగకపోవడం పట్ల నిరుద్యోగులు రాజకీయాలకు అతీతంగా మంగళవారం రోడ్డెక్కారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. యువతీయువకులు పెద్ద సంఖ్యలో నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరుద్యోగుల ఆందోళన సమాచారాన్ని అందుకున్న త్రీటౌన్ సి ఐ రాజశేఖర్, టుటౌన్ సి ఐ మధుబాబు, త్రీటౌన్ ఎస్ ఐ ఎ పైడిబాబు తదితరులు అక్కడకు చేరుకుని యువతతో చర్చించారు. ఈ సందర్భంగా పిడి ఎస్‌యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాకి నాని, ఇ భూషణం మాట్లాడుతూ ఈ నెల 5న ప్రకటించిన 334 సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు జిల్లాకు 10 పోస్టులు మాత్రమే కేటాయించగా, ఈ నెల 12వ తేదీన ప్రకటించిన 2723 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాకు ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రగల్భాలు పలికినప్పటికీ ఉద్యోగావకాశాలు కల్పించకుండా దారుణంగా మోసంచేశారన్నారు. పోలీసు శాఖలో పోస్టులు పెంచి ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగావకాశాలు కల్పించాలని, డి ఎస్‌సిలో కూడా పోస్టులు పెంచాలని వారు డిమాండ్ చేశారు.