పశ్చిమగోదావరి

భోజన నిర్వాహకులకు సక్రమంగా బిల్లులు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 13 : జిల్లాలో మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులకు సమయానికి బిల్లులు చెల్లింపులు జరిగినప్పుడే విద్యార్ధులకు నాణ్యమైన ఆహార పదార్దాలు అందించగలుగుతారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం విద్యా రంగ ప్రగతి తీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులకు ఏ నెలకు ఆ నెల బిల్లు చెల్లింపులు ఖచ్చితంగా జరగాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించామని ఇదే ధోరణి కొనసాగితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు చేయకుండా జాప్యం చేస్తే అందుకు నిర్వాహకుల నుండి ఏదైనా ఆశిస్తున్నట్లు భావించవల్సి వుంటుందన్నారు. ఇంటర్ మీడియట్ విద్యార్దులకు కూడా మధ్యాహ్న భోజన పధకం అమలుచేయడం జరుగుతుందని, అయితే ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు చెల్లించవలసిన నిధులు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఇదే ధోరణి కొనసాగితే ఆ విద్యార్దులకు మధ్యాహ్న భోజన పధకం అమలు చేయడం కష్టమని ఇప్పటికైనా సంబందిత అధికార్లు ఈ విషయంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పలు పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపై వంట చేయడం తమ దృష్టికి వచ్చిందని, ఇందుకు కారణం ఏమిటని డిఇవోను కలెక్టర్ ప్రశ్నించారు. దీనిపై డి ఇవో సివి రేణుక సమాధానం ఇస్తూ గ్యాస్ సరఫరా కారణంగా చూపగా కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఎక్కడా వంట గ్యాస్ కొరత లేదన్నారు. ఇకపై ఎక్కడైనా కట్టెల పొయ్యిపై మధ్యాహ్న భోజన పధకం కింద వంట చేయడం గమనిస్తే తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. జిల్లాలో 3200 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు నిర్వహించవలసిందేనని, అవి కేవలం మొక్కుబడి కాకుండా నిర్వహించాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉన్న స్థలాలను క్రీడాస్థలాలుగా అభివృద్ధి చేసే పనులు తక్షణమే పూర్తి చేసి విద్యార్ధులు ఆదుకునేందుకు వీలుగా ఉంచాలన్నారు. జిల్లాలో విద్యాప్రమాణాల స్థాయి మెరుగుపర్చేందుకు విద్యాశాఖాధికార్లు పటిష్టమైన కార్యాచరణ అమలుచేసి మెరుగైన ఫలితాలు తీసుకురావాలన్నారు. జిల్లాలో వర్చువల్ తరగతుల ఏర్పాటు, పాఠశాలల్లో క్రీడామైదానం అభివృద్ధి, పాఠశాలల్లో వేదికల నిర్మానం, డిజిటల్, వర్చువల్ తరగతుల నిర్మాణాలకు అవసరమైన స్టూడియో ఏర్పాటు, సంబంధిత ప్రత్యేక తరగతుల ఏర్పాటు విషయంలో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే బాలల దినోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వట్లూరు సర్ సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే బాలల దినోత్సవ వేడుకలు సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాటుచేయాలన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన బాల బాలికలకు బహుమతి ప్రదానం ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా క్రమవిక్షణ, క్రమపద్దతిలో బహుమతి ప్రదానోత్సవం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డి ఇవో రేణుక, సర్వశిక్ష అభియాన్ పివో బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.