పశ్చిమగోదావరి

ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, నవంబర్ 13: నమ్మకం.. ప్రభుత్వ రంగ సంస్థలంటేనే నమ్మకం.. కూలినాలి చేసుకుని కూడబెట్టినది వయసు పైబడ్డాక తమకు అండగా ఉంటుందని నిరుపేదలు భావిస్తారు. దీన్ని తనకు అనుకూలంగా భావించిన ఒక వ్యక్తి ఆ సొమ్ముతో ఉడాయించిన సంఘటన ఆకివీడులో జరిగింది. ఎక్కడ దాస్తే తమ సొమ్ముకు భరోసా ఉంటుందోనని భావించిన జనం ఆ భరోసాయే తమకు అన్యాయం చేసిందంటూ రోదిస్తున్నారు. ఎక్కువ శాతం మహిళలు ఎల్‌ఐసీలో ఇన్స్యూరెన్స్ చేస్తుంటారు. అయితే ఆ ఏజంట్లు తమతో పాలసీలను చేయించడమే కాక వాటి రెన్యువల్స్ దగ్గర నుండి వాయిదాల వరకు వారే చూసుకుంటారని భావనతో ముందుకు సాగుతారు. అయితే ఇదే క్రమంలో ఆకివీడుకు చెందిన ఓ వ్యక్తి కూడా గత కొంతకాలంగా ఎల్‌ఐసీ ఇన్స్యూరెన్స్ పాలసీలను కట్టిస్తున్నాడు. అయితే అతనిపై ఈ ప్రాంతవాసులకు నమ్మకం కూడా ఉండటంతో ఆ వ్యక్తి ఏమి చెబితే అదే తడవుగా పాలసీదారులు వ్యవహరిస్తున్నారు. గత కొనే్నళ్లుగా నమ్మకంగా ఉండటంతో వినియోగదారులు నమ్మకానికి మరింత బలం పెరిగింది. తానే కొన్ని వాయిదాలను చెల్లిస్తూ వినియోగదారులకు నమ్మకం కలిగించడమే కాక వారిలో ఇంట్లోని వ్యక్తిలా కలిసిపోయాడు. వాయిదాలను కూడా ఆ తర్వాతే వారి వద్ద నుండి వసూలు చేస్తుండటంతో వినియోగదారులకు పూర్తి భరోసా దొరికింది. దీంతో పాలసీ అయిన తర్వాత వారి సొమ్ము ఏవిధంగా డిపాజిట్ చేయాలో కూడా ఆ ఏజంట్ సూచిస్తుండటంతో ఆ వ్యక్తిపైనే వీరంతా ఆధారపడ్డారు. గత కొన్నిరోజులుగా ఆ ఏజెంట్ పాలసీ వాయిదాల నిమిత్తం తీసుకున్న సొమ్ము జమ చేయకపోవడంతో ఆరా తీశారు. అయినప్పటికీ నమ్మకం కలిగిన వ్యక్తి కావటంతో ఆచూకీ కూడా తీయలేదు. అయితే ఆ ఏజెంట్ పరారీలో ఉన్నాడని ఆనోటా ఈనోటా విన్నవారంతా ఒక్కసారిగా విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. కొంతమంది తమ పాలసీలు పూర్తయిన సొమ్మును ఆ వ్యక్తి చేతిలో పెట్టి వడ్డీకి ఇచ్చారు. అతను వారికి ప్రామిసరీ నోట్లను కూడా రాసి ఇవ్వడంతో మరింత నమ్మకం కలిగింది. ఈ నేపథ్యంలో ఆ ఏజెంట్ ఆకివీడులోని కొంతమందికి కోర్టు నోటీసులు పంపడంతో తతంగమంతా బయటకు వచ్చింది. విషయం తెలుసుకుందే తడవుగా ఆకివీడు మాదివాడలోని ఎల్‌ఐసీ బ్రాంచి వద్దకు వెళ్లి లబోదిబోమనడం ప్రారంభించారు. ఆకివీడులోని వెలమపేటకు చెందిన మరడాని నీలవేణి, సదడాని చిన్నమ్మ, సమతానగర్‌కు చెందిన దొడ్డి పద్మశ్రీలు బ్రాంచికి వెళ్లి సిబ్బందిని ఆరా తీశారు. అయితే సదరు వ్యక్తి కొంతకాలంగా అందుబాటులో లేడని చెప్పడంతో ఆ వ్యక్తి చేతిలో మోసపోయామని గ్రహించిన వారంతా రోదించడం ప్రారంభించారు. మరడాని నీలవేణి రూ.4లక్షలు, దొడ్డి పద్మశ్రీ రూ.70వేలు, సడగాని చిన్నమ్మ రూ.1.25లక్షలు అతనికి డిపాజిట్లు తీయమని సంతకాలు పెట్టిన బాండ్లను చూపించడం మొదలు పెట్టారు. తమ భర్తలు చనిపోవడంతో ఇన్స్యూరెన్స్ సొమ్ము తమ పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని భావించి ఈ వ్యక్తి చేతిలో మోసపోయామంటూ రోదించారు. డిపాజిట్లు పూర్తయి సంతకాలు పెట్టామని, అయితే తమకు నమ్మకం కావడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రోదించారు. తామంతా నిరక్ష్యరాస్యులం కావడంతో ఈ పరిస్థితి ఎదురైందని వారు పేర్కొన్నారు. కాగా ఈ ఏజెంట్ చేతిలో మోసపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. బాధితులంతా రోజువారి కూలీ చేసుకొని జీవిస్తుంటారు. దాదాపుగా ఎల్‌ఐసి పాలసీలు, డిపాజిట్ల పాటు ఈ వ్యక్తి ఆకివీడులోని పలువురి దగ్గర నుండి భారీగా రుణాలు చేసి నోటీసులు పంపినట్లు సమాచారం. ఇదే రీతిలో బాధితులు, వ్యాపారులు మోసపోయింది కోట్ల రూపాయలలోనే ఉన్నట్టు సమాచారం. కాగా ఎల్‌ఐసీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు వెనక్కి వెళ్లారు. సమాచారం తెలుసుకుంటున్న బాధితులు ఒక్కొక్కరిగా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు.