పశ్చిమగోదావరి

పోలీసు ఉద్యోగాలు కేటాయించాలని ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 13 : ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు ఉద్యోగుల నోటిఫికేషన్‌లో జిల్లాకు ఎటువంటి కేటాయింపు జరగకపోవడం పట్ల నిరుద్యోగులు రాజకీయాలకు అతీతంగా మంగళవారం రోడ్డెక్కారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. యువతీయువకులు పెద్ద సంఖ్యలో నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరుద్యోగుల ఆందోళన సమాచారాన్ని అందుకున్న త్రీటౌన్ సి ఐ రాజశేఖర్, టుటౌన్ సి ఐ మధుబాబు, త్రీటౌన్ ఎస్ ఐ ఎ పైడిబాబు తదితరులు అక్కడకు చేరుకుని యువతతో చర్చించారు. ఈ సందర్భంగా పిడి ఎస్‌యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాకి నాని, ఇ భూషణం మాట్లాడుతూ ఈ నెల 5న ప్రకటించిన 334 సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు జిల్లాకు 10 పోస్టులు మాత్రమే కేటాయించగా, ఈ నెల 12వ తేదీన ప్రకటించిన 2723 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాకు ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రగల్భాలు పలికినప్పటికీ ఉద్యోగావకాశాలు కల్పించకుండా దారుణంగా మోసంచేశారన్నారు. పోలీసు శాఖలో పోస్టులు పెంచి ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగావకాశాలు కల్పించాలని, డి ఎస్‌సిలో కూడా పోస్టులు పెంచాలని వారు డిమాండ్ చేశారు.

ఇసుక ట్ట్రాక్టర్లను వదిలేయాలని ఎంపీపీ వీరంగం
ద్వారకాతిరుమల, నవంబర్ 13: మా ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటారా..తక్షణమే వదిలేయాలంటూ ద్వారకాతిరుమల ఎంపీపీ వడ్లపూడి ప్రసాద్ స్థానిక తహసీల్దార్ వద్ద పట్టుబట్టారు. దీంతో ఇదేం గొడవరా బాబూ అంటూ తహసీల్దార్‌తోపాటు అక్కడున్న రెవెన్యూ సిబ్బంది తలలు పట్టుకున్నారు. నల్లజర్ల మండలం పోతిరెడ్డిపాలెం ఎర్ర కాలువ నుంచి మండలంలోని తిమ్మాపురం పంచాయతీ లక్ష్మీపురానికి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఈ క్రమంలో రామసింగవరం మీదుగా ద్వారకాతిరుమలకు చేరుకున్న ఆరు ఇసుక ట్రాక్టర్లను వీఆర్వోలు అడ్డుకున్నారు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్లు ఇష్టానుసారంగా మాట్లాడటంతోపాటు ఎంతో ధీమాగా వ్యవహరించారు. దీంతో వీఆర్వో ఎన్ నారాయణ ఈ ఇసుక అక్రమ తరలింపుపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై ఐ వీర్రాజు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఇసుక ట్రాక్టర్లు నావంటూ ఎంపీపీ వడ్లపూడి రంగ ప్రవేశం చేశారు. అయితే పోలీసులు దీనిపై కేసు నమోదు అయిందని చెప్పటంతో ఆయన నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో తహసీల్దార్ సుజాత అక్కడ లేకపోవటంతో ఎంపీపీతో సహా మరికొందరు నాయకులు సుమారు మూడు గంటల పాటు కార్యాలయం వద్ద వేచియున్నారు. సాయంత్రం 6గంటల సమయంలో కార్యాలయానికి చేరుకున్న తహసీల్దార్‌ను నాయకులు కలుసుకున్నారు. ఈ సమయంలో ఎంపీపీ మాట్లాడుతూ తన ట్రాక్టర్లను పట్టుకోవటం ఏమీ బాగోలేదన్నారు. దీనికి తహసీల్దార్ బదులు ఇస్తూ మీవని తెలియకపోవటం వల్లే ఈ పొరపాటు జరిగిందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమ ట్రాక్టర్లు వస్తే వదిలేయమని ముందే వీఆర్వోకు ట్రాక్టర్ల నెంబర్లు ఇచ్చామని, కానీ ఇలా పట్టుకుంటారనుకోలేదని ధ్వజమెత్తారు. దీనిపై తహసీల్దార్ బదులిస్తూ ఎస్సైతో మాట్లాడి ఏదో చేద్దామన్నారు. కానీ ఆ నాయకులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇసుక తీసుకువెళుతుంది తన సొంతానికి కాదని, గ్రామాల్లో సీసీ రోడ్లు వేయటానికని ఎంపీపీ అన్నారు. చివరికి కేసు నమోదైంది కాబట్టి ట్రాక్టర్లు వదిలేందుకు వీల్లేదని తహసీల్దార్ చెప్పటంతో నేతలు చేసేదేమీ లేక అక్కడ నుంచి వెనుతిరిగారు.