పశ్చిమగోదావరి

ప్రతిభా పాటవాలను వెలికి తీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 17 : సమాజంలో విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్న ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకువచ్చి వారిలో మనోధైర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో శనివారం విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల్లో ఏదో ఒక అంగ హీనత ఉన్నప్పటికీ శరీరంలో మిగిలిన అంగాలలో ఇతరులకన్నా ఎక్కువ ప్రతిభ ఉంటుందన్నారు. వాటిని పూర్తిగా వినియోగించుకోగలిగితే వభిన్న ప్రతిభావంతుల్లో ఎంతో అభివృద్దిని చూడగలుగుతామన్నారు. గత 5 సంవత్సరాలుగా అంతర్జాతీయ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవానికి తాను హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వపరంగా అందించే ఉపకరణాలు, యూనిట్లు పంపిణీ విషయంలో, వారికి ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో, ఆటపాటల పోటీలు నిర్వహించే అంశంలో ప్రసాదరావు సేలు అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి ప్రసాదరావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు వందకు పైగా అంశాలలో క్రీడా తదితర పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడల్లో ప్రతి భాగంలో మొదటి స్థానం పొందిన వారిని రాష్టస్థ్రాయి క్రీడలకు ఎంపిక చేస్తామన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ భాస్కర్ క్రీడాపతాకాన్ని ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ కో ఆర్డినేటర్ అలీ, బాలల సంక్షేమ కమిటీ ఛైర్మన్ మాధవీలత, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేస్తున్న సుమారు 22 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.