పశ్చిమగోదావరి

ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించే వారిపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 10: ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకోవడమే కాకుండా ఇతరులకు ఇబ్బందులు కలిగించే వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఫోన్ ద్వారా కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వీరవాసరం నుంచి కె నారాయణ గిరీష్ అనే వ్యక్తి మాట్లాడుతూ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గూడూరు శ్రీనివాస్ అనే వ్యక్తి వీధిలో అడ్డంగా సిమెంట్ ర్యాంప్ నిర్మించటమే కాకుండా ఆ వీధిలోకి వాటర్ ట్యాంకులు రానీయటం లేదని, అంతే కాకుండా తన ఇంటి డ్రెయినేజీ నీరు రోడ్డుపై విడిచిపెడుతున్నారని ఫిర్యాదు చేశారు. దాని వల్ల దుర్వాసన, దోమలతో అపరిశుభ్ర వాతావరణంతో ఎన్నో ఇబ్బందుల పడుతున్నామని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అధికారులు స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకోవటం ఇతరులకు ఇబ్బంది కల్గించే పనులు ఎవరుచేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వారు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. కలిసికట్టుగా ఉండి తమ ప్రాంతాభివృద్ధికి మలిక సౌకర్యాలు అందిపుచ్చుకోవటంలో సహకరించుకోవాలన్నారు. వీరవాసరం నుంచి మరొక వ్యక్తి శివరామకృష్ణ మాట్లాడుతూ తమ ప్రాంతంలో కోతుల బెడద విపరీతంగా ఉందని, పొలాలను నాశనం చేయటమే కాకుండా ఇళ్లల్లో చొరబడి తినుబండారాలు, సెల్‌ఫోన్లు కూడా తమ ఇంటి నుంచి తీసుకుపోయాయని చెప్పారు. వారిస్తున్న వారిపై దాడులు చేస్తుండటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కోతుల బెడద నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫారెస్టు అధికారులను ఆదేశించారు. నిడమర్రు మండలం భువనపల్లి గ్రామం నుంచి నంద్యాల వెంకట్రావు మాట్లాడుతూ తమ ఇంటి కుళాయి కనెక్షన్ కోసం పంచాయతీకి రూ.10వేలు చెల్లించానని, రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకూ అధికారులు కుళాయి కనెక్షన్ ఇవ్వలేదని ఆరోపించారు. గట్టిగా ప్రశ్నిస్తున్న తమపై కేసులు పెడతామంటూ అధికారులు బెదిరిస్తున్నారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ డబ్బులు కట్టించుకుని కనెక్షన్ ఎందుకు ఇవ్వడం లేదో విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీరవాసరం మండలం పాలెపల్లి గ్రామం నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి చెరువు, పశువుల చెరువు పక్కపక్కనే ఉండటంతో పశువుల చెరువులోని నీరు మంచినీటి చెరువులో చేరి కలుషితం అవుతోందని చెప్పాడు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అధికారులు పరిశీలించి గట్టును పటిష్టం చేసి, మంచినీటి చెరువు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో 18మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఎం వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్వో ఎన్ సత్యనారాయణ, డ్వామా పీడీ ఎం వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, సమాచార శాఖ ఏడీ కె సుభాషిణి, డీఆర్‌డీఏ పిడి శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అమరేశ్వరరావు, డీఈవో రేణుక, మత్స్యశాఖ జేడీ డాక్టర్ అంజలి, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, సెట్‌వెల్ సీఈవో సుబ్బిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

108 కోసం వినూత్న నిరసన
వీరవాసరం, డిసెంబర్ 20: వీరవాసరం మండలానికి 108 వాహనం మంజూరు చేయాలని వీరవాసరం గ్రామానికి చెందిన యువకులు సోమవారం వీరవాసరం పిహెచ్‌సి గేటుకు వినతిపత్రం అందించారు. గత నాలుగేళ్లుగా 108 వాహనం కోసం వేండ్ర దివాకరరావు అనే సామాజిక కార్యకర్త ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసి, రిలే దీక్షలు నిర్వహించారు. 2016, డిసెంబర్ 26న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు 108ని ప్రారంభించారు. అయితే ఆ వాహనాన్ని వెంటనే వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో గ్రామస్థులు అనేకమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్యలో పాత వాహనాన్ని మండలానికి అందించారు. అయితే ఆ వాహనం ఎప్పుడూ మరమ్మతులకు గురికావడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. నూతన వాహనం ఏర్పాటు చేసిన గ్రామానికి చెందిన యువకులు మూడేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం వినతిపత్రాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి ఉన్న గేటుకు తగిలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నక్కెళ్ల శివరామకృష్ణ, గుండా బాబు, నూకల కిరణ్‌కుమార్, బొల్లా వెంకట్, కొండ్రెడ్డి నారాయణ గిరీష్, బండారు మణికంఠ, కోళ్ల శ్రీను, బృందావనం నాగేంద్ర, పంజా మహేష్, పోలిశెట్టి మహేష్, పంపన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.