పశ్చిమగోదావరి

ప్రమాదాల నివారణలో నెంబర్ వన్‌గా రాజమహేంద్రవరం అసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, డిసెంబర్ 12: ఓఎన్జీసీ సంస్థ బాధ్యతాయుతమైన సంస్థ అని, ప్రమాదాల నివారణలో రాజమహేంద్రవరం అసెట్ ఇండియాలో నెంబర్ వన్‌గా నిలబడి అవార్డు పొందిందని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డీఎంఆర్ శేఖర్ అన్నారు. యలమంచిలి మండలం బాడవ గ్రామంలో ఓఎన్జీసీ సహకారంతో ఏర్పాటుచేసిన ఉప్పునీటిని తాగునీటిగా మార్చే యంత్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ యంత్రం నుంచి ఏటీఎం కార్డు ద్వారా నీరు వస్తుందని, ఒక్కో కార్డుకు 20లీటర్ల నీరు చొప్పున రోజుకు 3వేల కార్డుల వరకు నీరు వస్తుందని తెలిపారు. దీనిని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బాడవ గ్రామంలోను, నరసాపురం మండలం బియ్యపుతిప్ప, లికితపూడి గ్రామాల్లో ప్రారంభించామన్నారు. ప్రతీ ఏటా 350 నుంచి 400 కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 40 కోట్ల రూపాయలను సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఓఎన్జీసీకి వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సాంఘిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామని, ఓఎన్జీసీ మంచి సంస్థ అని ఆయన కొనియాడారు. మనకు వనరులు తక్కువ కావడంతో మన ఓఎన్జీసీ గ్యాస్‌ను 20 దేశాల్లో ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామన్నారు. ఆయిల్ గ్యాస్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు ఆయిల్, గ్యాస్‌లను తరలించుకుని పోతున్నాయంటున్నారని, ఓఎన్జీసీ మాత్రం అలా చేయడం లేదన్నారు. రాజమహేంద్రవరం అసెట్‌లో 30 నుంచి 35లక్షల క్యూబిక్‌ల ఆయిల్‌ను మన రాష్ట్రంలోనే కరెంటు కోసం హెచ్‌పీసీ ద్వారా పంపిస్తున్నామన్నారు. రైతుల కోసం ఆర్గానిక్ పంటలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాయి రాధ, వాటర్ డీసీ ఛైర్మన్ పి రామాంజనేయరాజు, జడ్పీటీసీ బోనం నాని, చిట్టూరి ఆంజనేయులు, బొప్పన చిన్న, ఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.