పశ్చిమగోదావరి

దోషరహితంగా ఓటర్ల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 12: దోషరహిత ఓటర్ల జాబితా రూపకల్పనే ధ్యేయంగా సంబంధిత ఎలక్టోరల్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్‌పి సిసోడియా పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బుధవారం ఓటర్ల జాబితా సవరణపై ఇఆర్వో, ఎఆర్వో, బిఎల్వోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. నూరుశాతం సరైన రీతిలో ఓటర్ల జాబితాను రూపొందించాలన్నారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంచే బాధ్యతను భారత రాజ్యాంగం మనపై పెట్టిందన్నారు. దానికి అనుగుణంగానే సంబంధిత అధికారులను నియమించిందని, వారు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో అర్హులైన ఓట్లు గల్లంతు కాకుండా చూడటంతోబాటు పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలో లోపాలను గుర్తించాలన్నారు. మృతి చెందిన వారి పేర్లను జాబితా నుండి తొలగించకపోవడం, ఓటర్ల పేరు తప్పుగా నమోదు చేయడం, జాబితాలో సంబంధిత వ్యక్తుల ఫోటోలు లేకపోవడం, వయసు, లింగ, బంధుత్వాలకు సంబంధించిన వివరాలు తప్పుగా నమోదైతే వాటిని తక్షణమే సరి చేయాలని సంబంధిత అధికారులను ఎన్నికల అధికారి సిసోడియా ఆదేశించారు. రెండు ప్రదేశాల్లో ఓటుహక్కు ఉన్న వారిని గుర్తించి వారికి అవసరమైన చోట ఓటు ఉండేలా చూడాలన్నారు. ఇందుకు దరఖాస్తు-7 ద్వారా నమోదు చేయాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహణలో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ఇఆర్వో, ఎఆర్వోలు సరైన దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన అర్హులైన వారందరినీ ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు 175 నియోజకవర్గాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయని పలువురు వ్యక్తం చేసిన ఆందోళన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి తలెత్తకుండా అధికారులను ఆయన ఆదేశించారు. ఒక పోలింగ్ స్టేషన్లో 50 కంటే ఎక్కువ ఓటర్ల తొలగింపు జరిగినా, 100 కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదైనా అటువంటి ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించాలన్నారు. అదేవిధంగా 2016-17లో తోలగించిన ఓటర్ల జాబితాలను మరోసారి పరిశీలించి నిజమైన ఓటర్లు ఉంటే వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులను గుర్తించేందుకు ముగ్గురు వ్యక్తుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందన్నారు. ఆ సమయంలో లోపాలు గుర్తిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటరు నమోదులోడోర్ నంబరు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. ఎక్కడైనా డోర్ నంబరు అందుబాటులో లేని సమయంలో ప్రత్యామ్నాయంగా సమీపంలోని డోర్ నంబరుకు అనుసంధానం నంబరు నమోదు చేయాలన్నారు. నర్సాపురం, భీమవరం, ఏలూరు నియోజకవర్గాల్లో డబుల్ ఓటర్లు నమోదైనట్టు తెలుస్తోందని, ఈ విషయంపై పూర్తి పరిశీలనచేయాలన్నారు. కొవ్వూరు నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ నెం.96లో 282 మంది ఓటర్లు అదనంగా చేరినట్టు సమాచారం ఉందని, దీనిపై కూడా పరిశీలన చేయాలన్నారు. ఆచంట నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ నెం.115లో 149 మంది ఓటర్లు తొలగించబడిన విషయాన్ని కూడా పరిశీలించి తగిన కారణాలు తెలియజేయాలన్నారు. పంచాయతీల నుండి మరణ ధ్రువీకరణ ఆధారంగా కూడా మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లో వౌలిక సౌకర్యాలపై దృష్టి పెట్టడంతోబాటు ఎన్నికల సంఘం ఎప్పటికపుడప జారీచేసే మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లా స్థాయిలో ఓటర్ల జాబితా సవరణపై కార్యాలయ పని వేళల్లో ప్రత్యేక టెలిఫోన్ నంబబరుతో ప్రత్యేక కేంద్రాన్ని నిర్వహించాలన్నారు. సంబంధిత సిబ్బందికి అవసరమైన ఓటర్ల జాబితాను ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచి ఓటరు తమపేరు ఉన్నదీ లేనిదీ చూసుకునే అవకాశం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో చాలా వరకు పోలింగ్ స్టేషన్లు పాఠశాలల్లోనే ఉన్నాయన్నారు. వీటిలో అదనపుతరగతి గదులు వసతితోపాటు నీరు, ఫర్నిచరు, టాయిలెట్లు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలోగత జూలై నుండి ఇప్పటివరకు వ్యక్తిగతంగా 87,694 దరఖాస్తులు, ఆన్‌లైన్ ద్వారా 1,27,333 దరఖాస్తులు వెరసి 2,15,027 దరఖాస్తులు అందాయన్నారు. వాటిలో 2,02,711 స్వీకరించి, 10,736 తిరస్కరించినట్టు తెలిపారు. మిగిలిన 1580 దరఖాస్తులు త్వరలో పరిష్కరిస్తామన్నారు. తొలుత సమావేశంలో పలు నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల్లో ఒకే ఓటరు పేరు నమోదు చేసుకోవడం తదితర అంశాలతో కూడిన సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ సత్యనారాయణ, జిల్లాలోని 15 నియోజకవర్గాలకు చెందిన ఇఆర్వో, ఎఆర్వో, బూత్‌లెవెల్ అధికారులు పాల్గొన్నారు.