పశ్చిమగోదావరి

బాపూ జయంతి వేడుకలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, డిసెంబర్ 14: పద్మశ్రీ బాపు జయంతి వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్థానిక లలితా ఘాట్ వద్ద బాపు విగ్రహానికి నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరసాపురం పట్టణంలో 1933 డిసెంబర్ 15న జన్మించిన సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ (బాపు) చిత్రకారుడిగా, సినీ దర్శకునిగా బాపు ప్రపంచ ఖ్యాతి సాధించారన్నారు. అంతేకాక తెలుగు అక్షరాలకు కొత్త వరవడి సృష్టించిన మహోన్నత వ్యక్తి బాపు అన్నారు. బాపు సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతీఏటా ఆయన జయంతి వేడులను వైభవంగా నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రతిఏటా సినీ ప్రముఖులను సత్కరించి బాపు రమణ పురస్కారం అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ప్రముఖ సినీ గాయకులు పద్మభూషణ్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు పురస్కారం అందించి ఘనంగా సత్కరించనున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బండారు పటేల్‌రాజా నాయుడు, బాపు కళాక్షేత్రం కమిటీ చైర్మన్ ఆత్మూరి వెంకట నరసయ్య, కన్వీనర్ రెడ్డప్ప ధవేజీ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ వాతావరణంలో సంక్రాంతి నిర్వహించాలి
ఏలూరు, డిసెంబర్ 14: జిల్లాలో అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా పూర్తిచేసి స్వచ్ఛ వాతావరణంలో ప్రజలు సంక్రాంతి నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం గ్రామ పంచాయతీల ప్రగతి తీరును డివిజనల్ పంచాయతీ అధికారులు, ఇవోఆర్డీలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు 909 నిర్మించాల్సి ఉండగా ఇంకా 166 యూనిట్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని, వాటిని సంక్రాంతిలోగా పూర్తి చేయాలన్నారు. సంక్రాంతి నాటికి ఘన, వ్యర్థ పదార్థాల షెడ్లలో వర్మీ కంపోస్టు తయారీ కచ్ఛితంగా ప్రారంభం కావాలన్నారు. ఈ పనులను సంక్రాంతిలోగా పూర్తి చేస్తారో, జీతాలు తీసుకోవడం వదులుకుంటారో పంచాయతీ కార్యదర్శులు, ఈవోఆర్డీలు నిర్ణయించుకోవాలన్నారు. వివిధ కారణాలతో వేరువేరు ప్రాంతాల్లో ఉండే వారంతా సంక్రాంతికి సొంత గ్రామాలకు వచ్చే నాటికి స్వచ్ఛ వాతావరణంలో స్వాగతం పలికేందుకు స్వచ్ఛ సంక్రాంతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ దృష్ట్యా అన్ని గ్రామాల్లో ఇళ్ల నుండి చెత్త సేకరణ, వ్యర్థాల నుండి ఎరువుల తయారీ, ఎల్‌ఈడీ వీధి దిపాలు ఏర్పాటు తదితర పనులను శ్రద్ధతో నిర్వహించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై ఆ గ్రామ కార్యదర్శి, ఆ మండల ఈవోఆర్డీల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనపడుతోందన్నారు. ఇంటింటి నుండి చెత్త సేకరణకు గ్రీన్ అంబాసిడర్‌లను, గ్రీన్ వెహికల్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అయితే ఆ ఇళ్ల నుండి చెత్త సేకరణ చేసినట్టు సంబంధిత గృహాలకు అమర్చిన ఆర్‌ఐడిఎఫ్ ట్యాగ్‌ల స్కానింగ్ ఎక్కడా 50 శాతం మించి కనపడటం లేదన్నారు. ఇకపై ప్రతిరోజూ కనీసం 80 శాతం పైబడి స్కానింగ్ జరగకపోతే సంబంధిత పంచాయతీ కార్యదర్శికి, ఈవోఆర్డీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికీ 50 గ్రామాల్లో గ్రీన్ అంబాసిడర్‌లను నియమించని పంచాయతీ కార్యదర్శులకు, సంబంధిత ఈవోఆర్డీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధాకారులను కలెక్టర్ ఆదేశించారు. సేంద్రియ ఎరువుల తయారీకి నాలుగైదు గ్రామాల్లో రహదార్లు, రహదార్ల పక్కన వేసే పశువుల పేడను సేకరించేందుకు ఒక వ్యక్తిని వాహనంతో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సేకరించిన పేడను ఆయా చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలకు తరలించాలన్నారు. గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు అవసరమైన మూడవ వైర్ వేసే పనులు వారంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో అమర్చిన ప్రతి వీధి దీపానికి అవసరమైన సిసిఎంఎస్ బాక్సుల ఏర్పాటు జనవరి నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 14 మండలాల్లో పంచాయతీల్లో సిబ్బంది హాజరు అసంతృప్తిగా ఉందని, ఈ విషయంపై ఈవోఆర్డీలు పూర్తి పర్యవేక్షణ చేయలేక పోతున్నారన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో సొంత కార్యాలయ భవనం, కంప్యూటర్, బయోమెట్రిక్ హాజరు పరికరం తదితరాలను సమకూర్చినప్పటికీ కొంత మంది ఇంకా ఇతర ప్రాంతాల్లో హాజరు వేయడం ఏమిటని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. అదేవిధంగా ఆలస్యంగా వచ్చే వారి సంఖ్య కూడా తగ్గడం లేదన్నారు. ఆయా గ్రామాల్లో నివసించకుండా ఇతర ప్రాంతాల నుండి విధులు నిర్వహిస్తే ఆ గ్రామాల్లో పారిశుద్ధ్య తదితర పరిస్థితులు ఎలా మెరుగుపడతాయని ఆయన ప్రశ్నించారు.
ఇళ్ల పన్ను వసూలుకు ఆన్‌లైన్ రశీదే
జిల్లాలో అన్ని గ్రామాల్లో పన్ను వసూళ్ల సమయంలో ఆన్‌లైన్ రశీదు మాత్రమే అందజేయాలన్నారు. ఈ విషయంలో పాత రశీదు పుస్తకాలు వినియోగించేందుకు ఎంతమాత్రం వీలు లేదని, ఇంకా అటువంటి వసూళ్లు చేస్తే వారు అవకతవకలకు పాల్పడుతున్నట్టు భావిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్న జనాభాలో 40 శాతం మందికి మీసేవ ద్వారా వివిధ ధ్రువీకరణ పత్రాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వారానికి కనీసం 8 వ్యవహారాలైనా మీ సేవ ద్వారా నిర్వహించాలన్నారు. మీకోసం సెల్ఫీల అంశంలో పెండింగ్‌లో ఉంచిన వారికి రూ.1000 చొప్పున అపరాధ రుసుము విధించాలన్నారు. మీ కోసంలో అందిన ఫిర్యాదులను కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో వారి నుండి అపరాధ రుసుము వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వి నాగార్జున సాగర్, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఈవోపీఆర్డీలు తదితరులు పాల్గొన్నారు.