పశ్చిమగోదావరి

నేత్రపర్వంగా ఉత్తర ద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, డిసెంబర్ 18: చిన్న తిరుపతిగా ఖ్యాతి గాంచిన శ్రీవారి క్షేత్రంలో ముక్కోటి పర్వదినం సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్తర ద్వార దర్శనం భక్తులకు నేత్రపర్వమైంది. తెల్లవారుఝామున భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిధ్యాల నడుమ వెండి గరుడ వాహనంపై ఉభయ దేవేరులతో కొలువై నీరాజనాలు అందుకుంటున్న చిన వెంకన్న దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తులు పరవశించారు. 41 రోజులపాటు నియమ నిష్ఠలతో శ్రీవారి దీక్షను చేపట్టిన గోవింద స్వాములు, భక్తులు ఆ సమయంలో స్వామివారిని దర్శించి తరించారు. శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కన్నులపండువైంది. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేకాలంకారాలు చేశారు. శుభ ముహూర్త సమయంలో అట్టహాసంగా ఉత్తర ద్వారాన్ని తెరవగా అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ రాజా ఎస్‌వి సుధాకరరావు, ఈవో దంతులూరి పెద్దిరాజు ఏర్పాట్లను పర్యవేక్షించి, స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.